Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ గోపాల్ వర్మ "బాబా"గా మారితే? ది బాస్...నెవర్ డైస్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (11:59 IST)
బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై షకలక శంకర్ టైటిల్ పాత్రలో యువ నిర్మాత బొమ్మకు మురళి నిర్మిస్తున్న సంచలన చిత్రం "ది బాస్". నెవర్ డైస్ అన్నది ఉపశీర్షిక.  వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ వంటి ఓ అపర మేధావి బాబాగా మారితే అనే ఊహాజనిత కథాంశం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత వివాదాస్పద చిత్రం 'ది బాస్-నెవర్ డైస్" టైటిల్ లోగోను ప్రముఖ నటుడు సునీల్ విడుదల చేశారు. 
 
 
ఈశ్వర్ బాబు దర్శకత్వంలో బొమ్మకు మురళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న "ది బాస్-నెవర్ డైస్" సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుందని సునీల్ చెప్పారు. రామ్ గోపాల్ వర్మను పోలిన వ్యక్తిగా షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. తమ చిత్రం "ది బాస్-నెవర్ డైస్" టైటిల్ లోగో ఆల్ రౌండర్ సునీల్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ఈశ్వర్ బాబు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.
 
 
డెబోరాఫెల్, సోహైల్, రాజశ్రీ, సన, హర్షవర్ధన్, పోసాని, సూపర్ ఉమన్ లిరిష, పటాస్ ప్రవీణ్, జబర్దస్త్ మురళి, చిట్టిబాబు, పంచ్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఛాయాగ్రహణం-కూర్పు: హిమాన్షు, సంభాషణలు: బాద్షా హెచ్.కె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కనకదుర్గ, నిర్మాణం: బొమ్మకు క్రియేషన్స్, సమర్పణ: హిమమాల బొమ్మకు, కథ-నిర్మాత: బొమ్మకు మురళి, దర్శకత్వం: ఈశ్వర్ బాబు ధూళిపూడి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్టు!!

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments