Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

ఠాగూర్
శుక్రవారం, 1 ఆగస్టు 2025 (14:39 IST)
ప్రముఖ సీనియర్ సినీ నటి రాధిక డెంగీ జ్వరంతో బాధపడుతుంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. జూలై 28వ తేదీన ఆమె చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. ఆమెకు నిర్వహించిన వివిధ రకాలైన రక్త పరీక్షల్లో డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్టు తేలింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 
 
అలాగే, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ నెల 5వ తేదీ వరకు చికిత్స అందించాల్సివుందని, ఆ తర్వాతే ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. మరోవైపు, డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, సహచరులు ప్రార్థిస్తున్నారు. 
 
కాగా, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలతో పాటు అనేక టీవీ సీరియల్స్‌లో నటించిన రాధిక కోలీవుడ్ చిత్రపరిశ్రమలో ప్రముఖ నటిగా కొనసాగుతున్నారు. కేవలం ఒక నటిగానే కాకుండా ఒక విజయవంతమైన నిర్మాతగా కూడా ఆమె పేరొందారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో అయితే, ఏకంగా 15 వరకు చిత్రాల్లో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments