Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

Advertiesment
victim woman

ఐవీఆర్

, శుక్రవారం, 4 జులై 2025 (14:46 IST)
రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. ఢిల్లీలోని 27 ఏళ్ల అమ్మాయి లైంగిక తృప్తి కోసం తన వ్యక్తిగత భాగంలోకి మాయిశ్చరైజర్ బాటిల్‌ను చొప్పించింది. ఆ బాటిల్ తన వ్యక్తిగత భాగంలో ఇరుక్కుపోవడంతో తీవ్రమైన బాధను అనుభవించింది. రెండు రోజులపాటు నొప్పి అనుభవించిన తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఐతే అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి బదలాయించారు.
 
వైద్య సహాయం అందించడానికి రెండు రోజుల ముందు ఆమె మాయిశ్చరైజర్ బాటిల్‌ను ఆమె తన వ్యక్తిగత భాగంలోకి నెట్టిందని తేలింది. దాంతో ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. మలం కూడా విడుదల చేయలేకపోయింది, దీనితో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లగా ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెను అత్యవసర విభాగానికి తరలించారు. లైంగిక తృప్తి కోసమే తను ఆ బాటిల్‌ను చొప్పించినట్లు వైద్యుల ముందు ఒప్పుకుంది. ఆ వస్తువు ఆమె ప్రేగులో ఇరుక్కుపోయింది.
 
ఆసుపత్రి వైద్యులు వెంటనే బాటిల్‌ను బైటకు తీయడానికి సిగ్మాయిడోస్కోపీ అనే ప్రక్రియను ఉపయోగించారు. ఇది శస్త్రచికిత్స లేకుండా నిర్వహించబడే ప్రక్రియ. కెమెరా పరికరంతో కూడిన ఫ్లెక్సిబుల్ ట్యూబ్‌ను శరీరంలోకి చొప్పించడం ద్వారా శరీరంలో వున్న ఇతర వస్తువులను గుర్తించడం, తొలగించడం జరిగింది. ఆపరేషన్ చేయకుండానే బాటిల్‌ను తొలగించారు. మరుసటి రోజు సదరు యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు.
 
శరీరంలోకి వస్తువులను చొప్పించడం వల్ల కలిగే ప్రమాదాలను ఈ ఘటన చూపిస్తోంది. ఇలా వస్తువులను శరీరంలోకి చొప్పిస్తే ఇన్ఫెక్షన్లు, కణాల నాశనం, ప్రేగు చిల్లులు వంటి ప్రమాదకరమైన వ్యాధుల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని వైద్యులు తెలియజేసారు. స్త్రీ వ్యక్తిగత భాగం, పేగు వ్యవస్థల యొక్క సున్నితమైన కణజాలాలు బాటిళ్ల వంటి గట్టి వస్తువులను తీసుకోలేవు కనుక ఇలాంటి పనులను ఎవ్వరూ పొరబాటున కూడా చేయకూడదని వారు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్