Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Advertiesment
asif khan

ఠాగూర్

, బుధవారం, 16 జులై 2025 (15:35 IST)
బాలీవుడ్ నటుడు ఆసిఫ్ ఖాన్‌ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను హూటాహుటిన ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. మరోవైపు, ఆయన తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గత కొన్ని గంటలుగా తాను ఆస్పత్రిలో ఉన్నానని, హాస్పిటల్ పైకప్పును చూసుకుంటూ, జీవితం ఎంత చిన్నదో గ్రహించానని చెప్పారు. ఒక్క క్షణంలో అన్నీ మారిపోతాయని, దేన్ని తేలికగా తీసుకోకూడదని తెలిపారు. 
 
జీవితంలో ఎవరూ ముఖ్యమో వారితో ఆనందంగా గడపండని సూచించారు. జీవితం ఒక వరమని చెప్పారు. ప్రస్తుతం కోలుకుంటున్నానని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని తెలిపారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు కామెంట్స్ చేశారు. ఆసిఫ్ ఖాన్ 2011లో రెఢీ చిత్రంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పలు చిత్రాల్లో విలక్షణమైన పాత్రలను పోషించారు. ప్రస్తుతం ఆయన పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయనకు "పంచాయత్" చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం