Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితపై వెబ్ సిరీస్.. కంగనా రనౌత్‌కు షాక్.. టీజర్ అదుర్స్ (video)

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (12:35 IST)
తమిళనాట దివంగత సీఎం జయలలితపై బయోపిక్స్ రెడీ అవుతున్నాయి. తమిళనాట ఇప్పుడు ఈమె జీవితంపై మూడు బయోపిక్స్ ఎవరికి వారు సపరేట్‌గా తీస్తున్నారు. అందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న తలైవి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 
 
అయితే రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో గౌతమ్ మీనన్ ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కించాడు. మొత్తం 14 ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయి. దీనికి క్వీన్ అనే టైటిల్ పెట్టాడు గౌతమ్. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. 
 
ఈ వెబ్ సిరీస్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాదని అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మొన్న విడుదలైన తలైవి టీజర్ కంటే ఇది అద్భుతంగా ఉందంటున్నారు అభిమానులు. 
 
2016 డిసెంబర్‌లో జయలలిత అనారోగ్యంతో కన్నుమూసారు. ఆమె మరణం కూడా ఇప్పటికీ ఒక మిస్టరీయే. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ది ఐరన్ లేడీ అనే సినిమా వస్తుంది. తలైవి ఎలాగూ అందరికీ తెలిసిందే. 
 
తాజాగా రమ్యకృష్ణ క్వీన్ వెబ్ సిరీస్ కూడా వస్తుంది. జయ చిన్ననాటి జీవితం నుంచి మొదలుపెట్టి ఆమె స్కూల్ జీవితం ఎదిగిన విధానం ఆ తర్వాత సినిమాలు ఎంజీఆర్‌తో పరిచయం సినిమాల్లో స్టార్ డమ్.. ఆయన మరణం తర్వాత పార్టీ పగ్గాలు తీసుకున్న విధానం అన్నీ చూపించాడు గౌతమ్ మీనన్. ఈ టీజర్‌ను లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments