నాడు భళ్లాలదేవ.. నేడు కాళకేయగా దగ్గుబాటి రానా

శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:58 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా వచ్చిన చిత్రంలో భళ్ళాలదేవుడుగా హీరో దగ్గుబాటి రానా కనిపించారు. ఆ పాత్రలో రానా నటన అద్భుతం. ఫలితంగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇపుడు మరోమారు మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్ర పేరు రానా కాళకేయ. 
 
హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌లో భాగంగా "హౌస్‌ఫుల్ 4" చిత్రం తెరకెక్కుతోంది. దీపావ‌ళి కానుక‌గా విడుద‌లకానున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు జోడీగా పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు జోడీగా కృతి కర్బంద నటించారు. ఫర్హాద్ సంఝీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పునర్జన్మ‌ల నేపథ్యంలో సాగుతుందట. 
 
1419, 2019 మధ్య కాలంలో సాగే ఈ కథలో బోలెడన్ని వినోదాలు ఉంటాయని తెలుస్తుంది. ఇందులో రానా కాళ‌కేయ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. 2015లో వ‌చ్చిన బేబీ చిత్రంతో హిందీ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన రానా... ఆ త‌ర్వాత బాహుబ‌లి ఫ్రాంచైజ్ చిత్రాల‌తో అల‌రించాడు. ఇప్పుడు హౌజ్‌ఫుల్ 4 అనే కామెడీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. 
 
తాజాగా హౌజ్‌ఫుల్ 4 చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులో రానా గెట‌ప్ ప్రేక్ష‌కుల‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. 1419 కాలం నాటి రాజ్యాన్ని కూల్చే పాత్ర‌ని రానా పోషిస్తున్నాడు. ఎంతో క్రూరంగా క‌నిపిస్తూ త‌న పాత్ర‌పై ఆస‌క్తి క‌లిగిస్తున్నాడు. ఈ సినిమాతో రానాకి హిందీలో మ‌రింత క్రేజ్ పెర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. తెలుగులో 'విరాట ప‌ర్వం' అనే సినిమాతో రానా బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఓ మంచి ప‌నికి శ్రీకారం చుట్టిన పూరీ... ఏంటా మంచి ప‌ని..?