Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్... బాలకృష్ణ ఏమన్నారంటే...

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (11:58 IST)
పశువైద్యురాలు దిశ అత్యాచార, హత్య కేసులోని నిందితులను తెలంగాణ పోలీసులు శుక్రవారం వేకువజామున ఎన్‌కౌంటర్ చేశారు. ఈ చర్యపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుడు నుంచి రాజకీయ నేత వరకు స్వాగతిస్తున్నారు. అలాగే, సినీ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు బాలకృష్ణ కూడా స్పందించారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దేవుడే పోలీసుల రూపంలో దిశ నిందితులను శిక్షించాడన్నారు. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరిందని బాలకృష్ణ తెలిపారు. అనంతరం బోయపాటి మాట్లాడుతూ.. పోలీసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. అందుకు శుక్రవారం ఎన్‌కౌంటరే ఉదాహరణ అని బోయపాటి శ్రీను తెలిపారు. 
 
దిశ హత్యాచార నిందితులను శుక్రవారం పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను చటాన్‌పల్లికి పోలీసులు వ్యానులో తీసుకెళ్లారు. ఘటనా ప్రదేశానికి వెళ్లగానే నలుగురు నిందితులూ.. ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments