పశువైద్యురాలు దిశని అతికిరాతకంగా చంపేసిన నిందితులని ఎన్‌కౌంటర్ చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ ఘటన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దిశకి న్యాయం జరిగింది. ఇప్పుడు దిశ ఆత్మ శాంతిస్తుందని వారు చెబుతున్నారు.
శుక్రవారం ఉదయం సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా చటాన్ పల్లికి నలుగురు నిందితులని తీసుకురాగా, వారు ఎదురు దాడి చేయడంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనిపై టాలీవుడ్ హీరో నాని స్పందించారు. "ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడు అయ్యుండాలి" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
అలాగే, పలువురు సెలబ్రెటీలు చేసిన ట్వీట్లను పరిశీలిస్తే,
* దిశ తల్లిదండ్రులు కోరుకున్నది జరిగిందని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు.
* హైదరాబాద్ పోలీసులకి నా శుభాకాంక్షలు. మిగతా కేసు నిందితులని కూడా కస్టడీలోకి తీసుకోవడం కాక, కేసు స్టడీ చేయాలని బాబీ అన్నారు.
* దిశాని మళ్ళీ మనం తీసుకురాలేకపోయిన, ఈ ఘటనతో నేరస్తుల గుండెల్లో వణుకు పడుతుందని నిఖిల్ అన్నారు.
* న్యాయం జరిగిందని బన్నీ ట్వీట్ చేశాడు.
* మన పోలీసులకి సెల్యూట్. ఇంకా మన పూర్తి కాలేదు. మహిళలు, సోదరీమణులందరికీ ముప్పు లేని ప్రపంచాన్ని సృష్టించడం సమాజంగా మన బాధ్యత. భవిష్యత్తులో ఏ అమ్మాయి కూడా ఈ అమానవీయ ఘటన జరగకుండా చూడాలి అని కార్తికేయ అన్నారు.
* తెలంగాణ పోలీసులని చూస్తే గర్వంగా ఉందని అనసూయ అన్నారు.