Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్విట్టర్‌పై సచిన్ ఫైర్.. అన్నీ నకిలీ అకౌంట్లే..

ట్విట్టర్‌పై సచిన్ ఫైర్.. అన్నీ నకిలీ అకౌంట్లే..
, గురువారం, 28 నవంబరు 2019 (14:11 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌పై ఫైర్ అయ్యారు. కూతురు సారా, కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌లు ట్విట్టర్‌లో లేరని, వారి పేరు మీద సోషల్‌ మీడియాలో ఉన్న అకౌంట్లన్ని నకిలీవని సచిన్ స్పష్టం చేశారు. నకిలీ ఖాతాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ను సచిన్ కోరారు. వెంటనే స్పందించిన ఆ సంస్థ.. నకిలీ అకౌంట్‌ను సస్పెండ్‌ చేసింది. 
 
ఈ వ్యవహారంపై సచిన్ మాట్లాడుతూ.. సారా, అర్జున్‌ పేరిట ఎలాంటి ఖాతాలు లేవని... వారి పేరిట సోషల్ మీడియాలో వున్నవన్నీ నకలీ అకౌంట్లేనని చెప్పారు. అంతేగాకుండా నకిలీ ఖాతాలలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
ఏడాదిన్నరగా అర్జున్‌ పేరిట నకిలీ ఖాతా నడుస్తుండడం గమనార్హం. అట్ జూనియర్‌-టెండూల్కర్‌ పేరు మీద ఎవరో అర్జున్‌ లాగా ఖాతా తెరిచారు. అందులో వ్యక్తులకు, సంస్థలకు వ్యతిరేకంగా హానికరమైన పోస్టులు చేస్తున్నారు. 
 
2018 జూన్‌ నుంచి జూనియర్‌ టెండూల్కర్‌ పేరిట యాక్టివ్‌గా ఉన్న ఈ అకౌంట్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌, కవర్‌ ఇమేజ్‌గా అర్జున్‌ ఫొటోను వాడుతున్నారు. ప్రస్తుతం సచిన్ ఇచ్చిన క్లారిటీతో సారాకు, అర్జున్‌కు ట్విట్టర్ ఖాతాలు లేవని తేలిపోయాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి వరకు ఆగండి.. అప్పటివరకు ఏమీ అడగొద్దు.. ధోనీ