Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని.. హిందీ టీవీ ఆర్టిస్ట్ కుమార్తె మృతి

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (18:27 IST)
పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. అయితే ఆ బొమ్మలే పిల్లల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. అవును.. తాజాగా ఆడుకునే బొమ్మను మింగిన నటుడి కుమార్తె మృతి చెందింది. హిందీ టీవీ ఇండస్ట్రీ నటుడు ప్రతీష్ వోరా కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి.. ప్లాస్టిక్ బొమ్మను మింగింది. 
 
పాప ఏడుస్తుంటే ఆకలి అనుకున్నారు. ఎంత సముదాయించినా ఏడుపు ఆపకపోవడంతో పాటు ఊపిరాడకపోవడంతో ఆస్పత్రికి తీసుకుని పరుగులు తీశారు. అప్పుడు కానీ విషయం తెలియలేదు.. చిన్నారి గొంతులో ఓ చిన్న బొమ్మ ఇరుక్కుందని. అప్పటికే పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు వెంటనే గొంతులోని బొమ్మను తలగించినా.. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. 
 
ప్రతీష్ రెండేళ్ల కుమార్తె తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన హిందీ టీవీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ఆయన కూతురికి ఎలాంటి అనారోగ్యం లేదు.. కేవలం ప్లాస్టిక్ బొమ్మ గొంతులో ఇరుక్కుని చనిపోయిందని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ప్రతీష్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. హిందీ బుల్లితెర నటులు ప్రతీష్‌ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments