Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న 'పుష్ప-2' మూవీ

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (09:33 IST)
అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'పుష్ప-2' చిత్రం కలెక్షన్ల పరంగా ఏమాత్రం తగ్గేదేలే అంటుంది. ఈ నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఈ నెల 24వ తేదీ మంగళవారంతో 20 రోజులు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌లోనూ ఈ సినిమా అప్రతిహతంగా దూసుకెళుతూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. మంగళవారం నాటికి ఈ సినిమా విడుదలై 20 రోజులు పూర్తయ్యాయి. అయినప్పటికీ హిందీలో ఈ మూవీ కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. 20వ రోజైన మంగళవారం మాత్రమే ఈ సినిమా రూ.14.25 కోట్లు వసూలు చేసిందని మూవీ కలెక్షన్లను ట్రాక్ చేసే 'శాక నిల్క్' పేర్కొంది.
 
అత్యధికంగా హిందీలో రూ.11.5 కోట్లు కొల్లగొట్టింది. ఓరిజినల్ వెర్షన్ తెలుగు, ఇతర వెర్షన్లలో వసూళ్లు నెమ్మదించినప్పటికీ హిందీ రాష్ట్రాల్లో వసూళ్లు కొనసాగుతున్నాయి. దీంతో గురువారం నాటికి దేశవ్యాప్తంగా 'పుష్ప-2' కలెక్షన్లు రూ.1075.60 కోట్లకు పెరిగాయి. 
 
క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు హాలిడే సీజన్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లు ఇదేవిధంగా కొనసాగవచ్చనే సినీ ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. హిందీ రాష్ట్రాల్లో ఇతర సినిమాల పోటీని కూడా తట్టుకొని 'పుష్ప-2' నిలబడుతుండడం విశేషం. కాగా, పుష్ప-2 కలెక్షన్లు దేశవ్యాప్తంగా రూ.700 కోట్ల, ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లు దాటేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments