Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యే సినీ ప్రముఖులు ఎవరంటే..?

Advertiesment
Dil Raju

ఠాగూర్

, గురువారం, 26 డిశెంబరు 2024 (09:07 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులు గురువారం ఉదయం భేటీకానున్నారు. ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశాన్ని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమన్వయం చేశారు. దిల్ రాజు నాయకత్వంలో అనేక మంది సినీ ప్రముఖులు సీఎంతో భేటీకానున్నారు. ఈ సమావేశం బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటరులో ఉదయం 10 గంటలకు జరగనుంది. 
 
ఈ సమావేశాంలో మా అసోసియేషన్, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నుంచి 36 మంది సభ్యుల బృందం హాజరుకానుంది. నిర్మాతలు డి.సురేశ్ బాబు, అల్లు అరవింద్, సుప్రియా, నాగవంశీ, రవిశంకర్, సునీల్ నారంగ్, నవీన్ ఎర్నేని.. హీరోలు వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, శివబాలాజీ, కిరణ్ అబ్బవరంతో పాటు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్, అనిల్ రావుపూడి, బాబీ, వంశీ తదితరులు కలిసే అవకాశం ఉంది.
 
అటు ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు.
 
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ప్రభుత్వం వైఖరి మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకూ సినిమా వాళ్లకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో నేడు జరగబోయే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత రోజులను గుర్తు చేసిన మెగాస్టార్... చిరంజీవి స్టన్నింగ్ లుక్స్...