మెగాస్టార్ చిరంజీవి మరోమారు పాత రోజులను గుర్తుకు తెస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన తాజా ఫోటోల్లో చిరంజీవి స్టన్నింగ్ లుక్స్ చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఫోటోలను చూస్తే ఈయనకు వయసు పెరగడం లేదని, తగ్గుతుందని అనిపించడం ఖాయం. 69 యేళ్ల వయసులోనూ మెగాస్టార్ నవ యువకుడిలా కనిపిస్తున్నారు.
ఇక చిరు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బింబిసారా ఫేం వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి మరో మూవీ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుపై ఇటీవలే అధికారికంగా ఓ ప్రకటన కూడా చేశారు. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాత. ఇలా యువ హీరోలకు పోటీగా చిరంజీవి వరుస చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు.