Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకు ఇస్మార్ట్ శంక‌రే నిద‌ర్శ‌నం అని చెప్పిన‌ పూరీ

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (17:49 IST)
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. పూరి - ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజైన ఫ‌స్ట్ డే ఫ‌ష్ట్ షో నుంచి బ్లాక్‌బ‌ష్ట‌ర్ టాక్ సొంతం చేసుకుని స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఇస్మార్ట్ శంక‌ర్ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో స‌క్స‌ెస్ టూర్ నిర్వ‌హిస్తుంది.
 
ఈ టూర్లో పూరి జ‌గ‌న్నాథ్ మీడియాతో మాట్లాడుతూ... ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. స‌క్సెస్ కంటే ఎక్కువ మ్యాడ్నెస్ క్రేజ్ క్రియేట్ చేసిన సినిమా ఇది. యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 3 ఇయ‌ర్స్ త‌ర్వాత నాకు ఇంత పెద్ద హిట్ రావ‌డం సో..హ్యాపీ. థియేట‌ర్‌కి వెళ్లి చూసాను. ప్రేక్ష‌కులు సాంగ్స్ కానీ.. డైలాగ్స్ కానీ.. ఎంజాయ్ చేయ‌డం చూస్తుంటే... మాకు ఎన‌ర్జీని ఇస్తుంది. 
 
మాస్ సినిమా పొట‌ెన్షియ‌ల్ ఏంటో ఈ సినిమా చెప్పింది నాకు. ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తాన‌ని అనుకుంటున్నాను. సిద్దిపేట‌, అనంతపురం, క‌ర్నూలు వెళ్లాం. విజ‌య‌వాడ వ‌చ్చాం. ఏలూరు, భీమ‌వ‌రం.. ఇలా వైజాగ్ వ‌ర‌కు ఈ విజ‌య‌యాత్ర‌ను కొన‌సాగిస్తాం.

మా హీరో ఇస్మార్ట్ శంక‌ర్ యు.ఎస్ ట్రిప్‌లో ఉండ‌టం వ‌ల‌న ఈ టూర్లో లేడు. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతాది. విజ‌య‌వాడ మ‌ళ్లీ వ‌స్తాం మరోసారి ప్రేక్ష‌కుల్ని క‌లుస్తాం. సినిమా బాగుంటే నెత్తిని పెట్టుకుంటారు అన‌డానికి ఇస్మార్ట్ శంక‌రే నిద‌ర్శ‌నం అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments