Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుక్‌ మై షో మొత్తం బ్లీడింగ్‌ రెడ్‌... ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ పై పూరి జగన్నాథ్‌

బుక్‌ మై షో మొత్తం బ్లీడింగ్‌ రెడ్‌... ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ పై పూరి జగన్నాథ్‌
, శుక్రవారం, 19 జులై 2019 (17:40 IST)
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మాతలుగా రూపొందించిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా సూపర్‌హిట్‌ టాక్‌తో టెర్రిఫిక్‌ ఓపెనింగ్స్‌ సాధించింది. డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ నుండి చిత్ర యూనిట్‌కి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సక్సెస్‌ కేక్‌ కట్‌ చేసి, బాణసంచా పేల్చి తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.
 
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ... ”అందరి మొహాల్లో ‘ఇస్మార్ట్‌ బ్లాక్‌ బస్టర్‌’ కనబడుతోంది. చాలా కాలం తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఇంత హ్యూజ్‌ ఓపెనింగ్స్‌ మేం ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు. సుదర్శన్‌ 35 ఎం.ఎం.లో సినిమా చూశాను. టెర్రిఫిక్‌ రెస్పాన్స్‌ ఉంది. సినిమాని సపోర్ట్‌ చేసి, టిక్కెట్‌ కొని చూసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. ఇంతకుముందే ఆర్‌.జి.వి. ఒక ట్వీట్‌ పెట్టారు. బుక్‌మైషో మొత్తం బ్లీడింగ్‌ రెడ్‌ అని. 
 
నా స్నేహితుడు ఫోన్‌ చేసి.. అందరం మాసే. కానీ ఇలాంటి సినిమాలు రాక కొంచెం క్లాస్‌లా బిహేవ్‌ చేస్తున్నాం. మల్టీప్లెక్స్‌లో బతుకుతున్న వాళ్లందరూ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చూసి బుద్ధి తెచ్చుకొని మాస్‌లా బయటకు వస్తున్నారు. రామ్‌ని చాలా మిస్‌ అవుతున్నాం. త్వరలోనే అందరం కలిసి టూర్‌ ప్లాన్‌ చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు ప్రేక్షకులు. సోషల్‌ మీడియాలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సాంగ్స్‌, డైలాగ్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ స్టార్ట్‌ చేస్తాం” అన్నారు.
 
చిత్ర నిర్మాత ఛార్మి మాట్లాడుతూ, ”కలెక్షన్స్‌ చూస్తుంటే బాబోయ్‌.. ఊపిరి ఆడటం లేదు. ప్రతి సినిమాకి కొంత ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండటం అనేది కామన్‌. కానీ ఈ సినిమా అన్నీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని దాటి హ్యూజ్‌ హిట్‌ అయింది. అన్నీ షోస్‌ ఫుల్‌ అవుతున్నాయి. నిన్న నాకు వచ్చిన థియేటర్ల సంఖ్య వేరు. ప్రస్తుతం ఉన్న థియేటర్ల సంఖ్య వేరు. థియేటర్లు ఇంక్రీజ్‌ అయ్యాయి. ఈ సినిమా లాంగ్‌ రన్‌ అవుతుంది అనడానికి ఇదే నిదర్శనం. డిస్ట్రిబ్యూటర్స్‌, బయ్యర్స్‌ అందరూ ఫోన్‌లు చేసి అభినందిస్తున్నారు. 
 
రిలీజైన ప్రతిచోట పాజిటివ్‌ వైబ్స్‌ క్రియేట్‌ చేసి, నేను ఇంతకుముందు చెప్పినట్లు, సినిమా ఫుల్‌మీల్స్‌లా కాకుండా డబుల్‌ మీల్స్‌లా ఉంది. రామ్‌ ఇక్కడ లేకున్నా మాతో ఎప్పుడూ టచ్‌లో ఉన్నారు. మా టీమ్‌ అందరం కలిసి హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు టూర్‌ ప్లాన్‌ చేస్తున్నాం. ఒక పూరి అభిమానిగా చాలాకాలం నుండి ఇలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పటికి నా కల నిజమైంది. రామ్‌తో పాటు నభా, నిధి అద్భుతమైన నటన కనబరిచారు. సినిమాకి పని చేసిన టీమ్‌ అందరికీ థాంక్స్‌. ఈ సినిమా ఎంత కలెక్ట్‌ చేస్తుందనేది ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది” అన్నారు.
webdunia
 
నిర్మాత అభిషేక్‌ నామా మాట్లాడుతూ... ”ఇంత మంచి సినిమా ఇచ్చిన పూరి, ఛార్మిలకు థాంక్స్‌. ఆకలితో ఉన్న పూరి ఫ్యాన్స్‌ అందరికీ డబుల్‌ మీల్స్‌లా ఉంది. ఇంత పెద్ద విజయం ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు. రామ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌. ఈ సినిమా రిలీజ్‌కి ముందు ‘పోకిరి’, ‘దేశముదురు’, ‘బిజినెస్‌మెన్‌’ చిత్రాలతో కూడిన పోస్టర్‌ రిలీజ్‌ చేశాం. ఈ సినిమా కూడా వాటిల్లో చేరుతుంది. 
 
ఒక థియేటర్‌ యజమాని ఫోన్‌ చేసి.. తొమ్మిది నెలల తర్వాత హౌస్‌ఫుల్‌ బోర్డ్‌ తీసి బూజు దులిపి పెట్టాం సర్‌ అన్నారు. అది మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. రాత్రి వెయ్యి థియేటర్లలో స్టార్ట్‌ అయి మార్నింగ్‌ షోకి 1100 థియేటర్లకి పెరిగింది. మ్యాట్నీకి ఇంకా పెరిగే అవకాశముంది. సక్సెస్‌ను అందరం కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాం” అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆర్ఆర్ఆర్' నిర్మాతనని చెప్పి మహిళా న్యాయవాదికి టోకరా