Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరు, పూరి సినిమా - ఇక మెగా అభిమానుల‌కు ఇక పండ‌గే...

Advertiesment
చిరు, పూరి సినిమా - ఇక మెగా అభిమానుల‌కు ఇక పండ‌గే...
, శుక్రవారం, 26 జులై 2019 (17:25 IST)
మెగాస్టార్ చిరంజీవితో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడు కానీ.. కాలం క‌లిసి రాక ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. నాలుగు సార్లు చిరుతో మూవీ దాదాపు క‌న్ఫ‌ర్మ్ అనుకున్నాకా ఆగిపోయింద‌ట‌. రెండుసార్లు అయితే... ఏకంగా పూజా కార్య‌క్ర‌మాలు కూడా చేసార‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల పూరీ స్వ‌యంగా చెప్పారు. 
 
చిరు సినిమా చేస్తానంటే...5 రోజుల్లో స్ర్కిప్ట్ రెడీ చేస్తాన‌న్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... చిరు ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాని స్పెష‌ల్ షో వేయించుకుని చూసార‌ట‌. చిరు, చ‌ర‌ణ్‌కి ఈ సినిమా చాలా బాగా న‌చ్చేసింద‌ట‌. అందుక‌నే చ‌ర‌ణ్ ఫేస్ బుక్ ద్వారా ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా పైన త‌న అభిప్రాయాన్ని చెప్పారు. 
 
ఇంత‌కీ చ‌ర‌ణ్ ఏమన్నాడంటే.. రామ్ ఎన‌ర్జీ అదిరింది. పూరి గారు అయితే... అద‌ర‌గొట్టేసారు. కంగ్రాట్స్ టు ది టీమ్ అంటూ ఇస్మార్ట్ శంక‌ర్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఈ సినిమా న‌చ్చ‌డం... చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించ‌డం చూస్తుంటే.. చిరు - పూరి సినిమా ఈసారి ఖాయం అనిపిస్తుంది. ఇదే క‌నుక జ‌రిగితే... మెగా అభిమానుల‌కు పండ‌గే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇపుడిపుడే అన్నీ చక్కబడుతున్నాయ్ : కంగనా రనౌత్