Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా ప్రేమ గురించి తెలిసి నేను కూడా షాకయ్యా, సురేష్‌ బాబు

Webdunia
గురువారం, 14 మే 2020 (13:53 IST)
దగ్గుబాటి రానా.. బాహుబలి సినిమా తర్వాత ఎంత పాపులర్ అయ్యాడో తెలిసిందే. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్‌తో రానా వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీ అయ్యాడు. ఓవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే... మరోవైపు తమిళ్, హిందీలో కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రానా నటించిన అరణ్య అనే సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. 
 
వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇలా.. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్లో బిజీగా ఉన్న రానా  మిహీక బజాజ్ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నానని.. ఆమెను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
 
అయితే.. రానా ప్రేమ గురించి తండ్రి సురేష్‌ బాబు స్పందించారు. ఇంతకీ.. సురేష్‌ బాబు ఏమన్నారంటే... అందరిలాగే నేను కూడా షాక్ అయ్యాను అని చెప్పారు. రానా - మిహీక మంచి ఫ్రెండ్స్ అని తెలుసు కానీ.. ప్రేమలో ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయామన్నారు. లాక్ డౌన్ వలన ఎలాంటి పనులు లేక చాలా బోర్‌గా ఉందని.. ఇప్పుడు రానా చెప్పిన వార్త వలన చాలా పని పడింది. డిసెంబర్ లోపు పెళ్లి చేయాలనుకుంటున్నాం అని సురేష్‌ బాబు చెప్పారు. అయితే.. పెళ్లి ఎక్కడ చేయనున్నారు..? అనేది మాత్రం తెలియచేయలేదు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత రానా పెళ్లి గురించి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments