Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో కథానాయికగా ప్రియాంక మోహన్ (video)

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (15:53 IST)
Priyanka Mohan
నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సహ నిర్మాతలు.
 
భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఇటివలే ప్రామెసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర కోసం ఈ ప్రాజెక్ట్ లో చేరారు. తాజాగా 'కెప్టెన్ మిల్లర్” కథానాయిక ఖరారైయింది. ఈ చిత్రంలో ధనుష్ కి జోడిగా ప్రియాంక మోహన్ నటించనున్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారక ప్రకటన చేశారు.
 
“కెప్టెన్ మిల్లర్” గురించి సోషల్ మీడియా వేదికగా ప్రియాంక మోహన్ ఆనందం వ్యక్తం చేశారు. ''ఇంత భారీ ప్రాజెక్ట్ లో భాగం కావడం, ధనుష్ గారితో జోడిగా నటించే అవకాశం రావడం ఆనందంగా వుంది. అరుణ్ మాథేశ్వరన్, సత్యజ్యోతి ఫిల్మ్స్ కి కృతజ్ఞతలు. ఈ సినిమా షూటింగ్ కోసం ఎదురుచుస్తున్నా'' అని అని ట్వీట్ చేశారు.  
 
శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
 
తారాగణం: ధనుష్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్  
సాంకేతిక విభాగం :
రచయిత, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాతలు: జి. శరవణన్ , సాయి సిద్ధార్థ్
సమర్పణ: టీజీ  త్యాగరాజన్
బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: నాగూరన్
ఆర్ట్: టి.రామలింగం

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments