Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉడాన్‌ రిష్తా సమ్మిట్‌ కార్యక్రమంలో పాల్గొన్న భారతదేశ మిల్లర్లు

Udaan
, శుక్రవారం, 17 జూన్ 2022 (22:55 IST)
తమ భాగస్వామ్య మిల్లర్లతో కలిసి తమ 6వ వ్యవస్థాపక దినోత్సవం వేడుక చేయడంలో భాగంగా భారతదేశపు అతిపెద్ద బిజినెస్‌ టు బిజినెస్‌ ఇ-కామర్స్‌ వేదిక ఉడాన్‌ నేడు రిష్తా సమ్మిట్‌ను ప్రారంభించింది. ఉడాన్‌ వృద్ధిలో మిల్లర్లు అందించిన తోడ్పాటును గుర్తించడంలో భాగంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. గత ఆరు సంవత్సరాల కాలంలో ఉడాన్‌, భారతదేశ వ్యాప్తంగా మిల్లర్లతో శక్తివంతమైన అనుబంధం ఏర్పరుచుకోవడంతో పాటుగా ఆహార వ్యాపారానికి అవసరమైన ప్రధానమైన ఆహారవస్తువులను సేకరిస్తోంది.

 
ఈ రెండు రోజుల కార్యక్రమం, ఉడాన్‌ నిర్వహించిన మొట్టమొదటి సదస్సు కావడంతో పాటుగా 19 రాష్ట్రాల నుంచి 75 మంది మిల్లర్లు, ఉడాన్‌ నాయకత్వ బృందం దీనిలో పాల్గొన్నారు. రిష్తా అంటే బంధం అనే నేపథ్యంతో నిర్వహించిన ఈ సదస్సు ద్వారా మిల్లర్లతో బంధం బలోపేతం చేసుకోవడంతో పాటుగా ఉడాన్‌ విస్తృత శ్రేణి పంపిణీ నెట్‌వర్క్‌, రిటైల్‌ భాగస్వాముల ద్వారా ప్రత్యక్షంగా మార్కెట్‌ అవకాశాలను అందించడం చేయనుంది.

 
ఉడాన్‌, చీఫ్‌ సోర్సింగ్‌ ఆఫీసర్‌ (ఫుడ్‌ బిజినెస్‌) అర్వింద్‌ చారీ మాట్లాడుతూ, ‘‘మా మొట్టమొదటి రిష్తా సదస్సు, ఉడాన్‌ యొక్క వృద్థి కథకు తోడ్పాటునందిస్తున్న భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మిల్లర్లును గుర్తించి, గౌరవించేందుకు నిర్వహిస్తున్నాము. బీ2బీ ఇ-కామర్స్‌లో ఉడాన్‌ యొక్క నైపుణ్యం, మిల్లర్‌ భాగస్వాములు తమ ఉత్పత్తులు, బ్రాండ్లకు  భారీ మార్కెట్‌ పొందేందుకు తోడ్పడుతుంది. ఈ కారణం చేతనే మిల్లర్లు,  రైతులకు ప్రాధాన్యతా భాగస్వామిగా ఉడాన్‌ నిలుస్తుంది’’ అని అన్నారు.

 
ఉడాన్‌ ప్రస్తుతం మూడు మిలియన్ల మంది రిటైలర్లు, కెమిస్ట్‌లు, కిరాణా షాప్‌లు, హోరెకా రైతులతో కూడిన నెట్‌వర్క్‌తో పాటుగా 1200 నగరాల్లో 25-30వేల మంది విక్రేతలను కలిగి 12వేల పిన్‌ కోడ్స్‌ను కవర్‌చేస్తుంది. నెలకు ఐదు మిలియన్‌ లావాదేవీలు ఈ వేదికపై జరుగుతున్నాయి. తద్వారా భారతదేశంలో అతిపెద్ద బీ2బీ ఈ-కామర్స్‌ వ్యాపారంగా ఉడాన్‌ నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంగన్‌వాడీల నిర్వహణలో అవకతవకలపై కఠిన చర్యలు: డాక్టర్ సిరి