Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడు తేజ, ద‌గ్గుబాటి అభిరామ్ అహింస నుంచి ఫ‌స్ట్ సింగిల్‌

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (15:43 IST)
Abhiram, Geetika
క్రియేటివ్ జీనియస్ తేజ ప్రస్తుతం 'అహింస' అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో నూతననటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
 
ఈ సినిమా ప్రొమోషన్స్ ని చాలా వినూత్నంగా చేస్తున్నారు. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ 'నీతోనే నీతోనే' పాట ని విడుదల చేశారు. ఆర్‌పి పట్నాయక్ ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడిగా కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ తన బ్రిలియంట్ వాయిస్ తో మెస్మరైజ్ చేయగా, సత్య యామిని వాయిస్ పాటకు మరింత మాధుర్యాన్ని ఇచ్చింది.
 
♫కలలో అయినా
కలయికలో అయినా
కలిసుండని కాలాలైనా
నీతోనే నీతోనే.. నేనెపుడు
నాతోనే నాతోనే నువ్వేపుడు ♫
ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఆకట్టుకుంది.
 
ఈ చిత్రంతో అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గీతిక కథానాయికగా నటిస్తోంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
 
చాలా కాలం తర్వాత, తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఆర్‌పి పట్నాయక్‌ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ 'అహింస' కోసం కలిసింది. అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించగా, సుప్రియ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సదా, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
తారాగణం: అభిరామ్, గీతిక, రజత్ బేడీ, సాధా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments