Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ సేతుపతితో నటించాలనుంది.. ప్రియా ప్రకాష్ వారియర్

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (17:57 IST)
ప్రియా ప్రకాష్ వారియర్.. ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీగా మారిపోయింది. గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రియా ప్రకాష్ వారియర్ కన్నుగీటిన ఒరు అదార్ లవ్ సినిమాలోని ఓ సన్నివేశం.. ఆమెను ఓవర్‌నైట్‌ స్టార్‌గా మార్చేసింది. ప్రస్తుతం ఒరు అదార్ లవ్ సినిమా లవర్స్ డేగా రాబోతోంది. ఈ సినిమా వాలైంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియా ప్రకాష్ వారియర్.. తాను ఇప్పటివరకు 200సార్లు కన్నుకొట్టానని.. తానెక్కడి వెళ్లినా కన్నుకొట్టమని అడుగుతున్నారని చెప్పింది. ఎవరైనా కన్నుకొట్టమని అడిగితే చిరాకు రావట్లేదు కానీ.. బోరింగ్ అనిపిస్తోందని తెలిపింది. తాను కన్నుకొడితే ఇలా వైరలై కుర్చుంటుందని.. అప్పట్లో తాను ఊహించలేకపోయానని, ఈ సినిమా తర్వాత తన జీవితంలో పెనుమార్పులేమీ లేవని చెప్పుకొచ్చింది. తాను ఇప్పటికీ మిడిల్ క్లాస్ అమ్మాయినేనని తెలిపింది. 
 
కానీ తానెక్కిడికి వెళ్లినా అభిమానులు సెల్ఫీలు అడుగుతుంటారని, దీంతో కొంత ప్రైవసీ కోల్పోయిన మాట నిజమేనని వివరించింది. ఐటమ్ సాంగ్స్ చేయడంలో అభ్యంతరం లేదని.. విజయ్ సేతుపతితో కలిసి నటించాలని వుందని చెప్పుకొచ్చింది. అంతేగాకుండా.. ఒరు అదాల్ లవ్ విడుదల కానుండటంతో కొంత కంగారుగా వుందని ప్రియా ప్రకాష్ వారియర్ వెల్లడించింది. అట్లీ దర్శకత్వం అంటే పడి చస్తానని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ కలహాలు - ఇద్దరు పిల్లను చంపి తండ్రి ఆత్మహత్య

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments