Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళికి ముందే ఆ సంబంధం వారి వ్యక్తిగతంః అంజలి

నా న‌ట‌న చూసి ప‌వ‌న్ క్లాప్స్ కొట్టారు

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (17:19 IST)
Anjali latest
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'వకీల్ సాబ్' ఏప్రిల్ 9న  ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది అంజలి. "వకీల్ సాబ్" గురించి, ఈ చిత్రంలో తన పాత్ర గురించి అంజలి తెలిపారు. ఆ విశేషాలు ఆమె మాటల్లో విందాం.
 
- "దర్శకుడు శ్రీరామ్ వేణు గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు పింక్ సినిమా రీమేక్ చేస్తున్నాం. కానీ తెలుగు నేటివిటీకి తగినట్లు కొత్తగా ఉంటుంది అని చెప్పారు. సినిమా గురించి ఆయన చెప్పిన కాన్సెప్ట్ లు బాగా నచ్చాయి. మేము ఈ సినిమాలో చేసిన మార్పులు వకీల్ సాబ్ ట్రైలర్ చూశాక మీకు అర్థమయ్యి ఉంటుంది. హిందీ పింక్ తో వకీల్ సాబ్ను కంపేర్ చేసి చెప్పలేను.
 
- పవన్ కళ్యాణ్ గారితో నటించడం మొదట్లో కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉండేది. ఆయన వస్తుంటే సెట్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. నేను జనరల్ గా ఎక్కువగా మాట్లాడుతాను. అలాంటి టైమ్ లో నా వల్ల మిగతా వారు ఏదైనా డిస్ట్రబ్ అవుతారా అని భయపడ్డాను. పవన్ గారు చాలా ఇన్ పుట్స్ ఇస్తూ సినిమా చేయించారు. అవన్నీ చూశాక మన క్యారెక్టర్ మనం సరిగ్గా చేస్తే సరిపోతుంది అనే నమ్మకం వచ్చింది. నాకూ, నివేదా, అనన్యకు మధ్య చాలా సీన్స్ ఉంటాయి. మా మధ్య రిలేషన్ లేకుంటే క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా రావు. మా మధ్య చాలా తక్కువ టైమ్ లో బాండింగ్ ఏర్పడింది. అందువల్ల నటించేప్పుడు చాలా ఈజీ అయ్యింది. 
 
- నా క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎలాంటి వివరాలు చెప్పలేను. పవన్ గారు సెట్స్ లో చాలా కామ్ గా ఉంటారు. అందరితోనూ మాట్లాడుతారు. హుందాగా ఉంటారు. ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటేనే నాకు పదిహేను రోజులు పట్టింది. పవన్ గారితో సినిమా అనగానే జంప్ చేశాను. అయితే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని ఆలోచించాను. పవన్ గారితో సినిమా చేస్తున్నాను అనేదే నా మనసులో ఉండేది. పెద్ద హీరోతో పనిచేస్తున్నప్పుడు మన క్యారెక్టర్స్ కొట్టుకుపోతాయి. కానీ వకీల్ సాబ్ లో నా క్యారెక్టర్ కు ఒక స్థానం ఉంటుంది.
 
- వకీల్ సాబ్ ను పింక్ తో పోల్చితే, పింక్ కథలోని సోల్ ఇందులో అలాగే ఉంటుంది. మార్పులన్నీ ఆ మెయిన్ స్టోరీ చుట్టూ చేశారు. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు మనకు నిత్యకృత్యం అయ్యాయి. ఆ వార్తలు మనకు కామన్ అయి పోయాయి. మన ఇంట్లో ఇలాంటిది జరిగితే ఎలా రెస్పాండ్ అవుతాం అనేది చూపిస్తున్నాం. ఇలాంటి సందర్భాలు ఏ అమ్మాయికీ రాకూడదు. 
 
- సినిమా ఇండస్ట్రీలో నాయికలకు కొన్ని చేదు సందర్భాలు ఎదురవుతుంటాయి అంటారు. అయితే ఇక్కడ సెలబ్రిటీ, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అని కాదు అమ్మాయి అమ్మాయే. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. అవును డబ్బులు తీసుకున్నాం అని. ఆ ఒక్క సీన్ చాలు నా క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుంది అని చెప్పేందుకు. ఈ సీన్ మరో రోజు చేయాల్సింది. కానీ ఆ రోజు సడెన్ గా షూట్ చేశాం. ఈ కోర్ట్ సీన్ చేశాక, నేను వణికిపోయాను. అంత ఉద్వేగానికి గురయ్యాను. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ చేసేప్పుడు నటిగా నేనూ ఉద్వేగపడతాను. అలా అయితేనే సీన్ కరెక్ట్ గా వస్తుంది.
 
- వకీల్ సాబ్ లో ప్రకాష్ రాజ్ గారితో మరోసారి పనిచేసే అవకాశం వచ్చింది. రెండు సీన్స్ లో ప్రకాష్ రాజ్ గారితో కలిసి నటించాను. మన ఎదుట ఉన్న ఆర్టిస్ట్ బాగా నటిస్తేనే, మనకూ ఆ టైమింగ్ వస్తుంది. వాళ్లు ఫర్మార్మ్ చేయకుంటే మనమూ డల్ అ‌వుతాం.  ప్రకాష్ రాజ్ గారితో పనిచేసినప్పుడు మనకూ ఆ ఎనర్జీ వస్తుంది.
 
- మీకు ఇష్టమైతే ఎస్ లేకుంటే నో చెప్పడం మీ ఛాయిస్. నో చెప్పకూడదు అని ప్రశ్నించే రైట్ ఎవరికీ లేదు. ఇష్టపడటం ఇష్ట పడకపోవడం అమ్మాయి నిర్ణయానికి వదిలేయాలి. సినిమాలోనూ పవన్ గారు ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు.
 
- మగువా మగువా పాట హిందీలో లేదు. మహిళల మీద ఈ పాట చేయడం సినిమాలో చేసిన మంచి మార్పు. మగువా పాట విన్నప్పుడు మీ ఫేస్ లో ఒక సంతోషం వస్తుంది. ఈ సాంగ్ కోసం చాలా మాంటేజ్ లు షూట్ చేశాం. వాటిలో బెస్ట్ అనిపించుకున్నవి  పాటలో పెట్టాం. పింక్ హిందీ, తమిళ చిత్రాల్లో మగువా లాంటి పాట ఉండదు.
 
- ట్రైలర్ లో మీరు చూసిన సీన్ చేశాక పవన్ గారు క్లాప్ కొట్టి నన్ను అప్లాజ్ చేశారు. సాధారణంగా పవన్ గారు ఎక్స్ ప్రెసివ్ గా ఉండరు. కానీ ఆయన ప్రశంసించాక సంతోషం కలిగింది.
 
- ప్రీమారిటల్ సెక్స్ అనేది వ్యక్తిగత విషయం. వారివారి ఇష్టాలను బట్టి ఉంటుంది. ఎవరి ఆలోచనలు బట్టి అది ఆధారపడి ఉంటుంది.ఫెమినిజం అనే విషయాన్ని మంచిమార్గంలో వాడితే మంచిదనేది నా ఉద్దేశం. నేను గతంలో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాను. వాటిలో వకీల్ సాబ్ క్యారెక్టర్ తప్పకుండా ఉంటుందని చెప్పగలను. తెలుగు, తమిళంలో కొన్ని ఎగ్జైటింగ్ చిత్రాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో చెబుతాను.
 
- ఏ నాయికైనా తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనే దానిపై ఆమె కెరీర్ ఆధారపడి ఉంటుంది. నాకు కెరీర్ లో ఎప్పుడూ గ్యాప్ రాలేదు. నచ్చిన సినిమాలు ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నాను. నేను ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నానో భవిష్యత్ లోనూ అలాగే కంటిన్యూ చేస్తున్నాను.ష అని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ఎప్పుడొస్తుందా చూద్దామని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా: అంబటి రాంబాబు (video)

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

స్పేస్ ఎక్స్ విమానంలో భూమికి తిరిగిరానున్న సునీత-విల్మోర్‌

చెవిరెడ్డి కూడా నాకు చెప్పేవాడా? నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోలేరు: బాలినేని కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం