పవన్‌కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సోమవారం ఆర్‌టిసి.క్రాస్రోడ్‌లోని సుదర్శన్ థియేటర్‌లో విడుదలైంది సాయంత్రం 5గంటల తర్వాత అదే సమయంలో రెండు తెలుగు రాష్రటాలలో వివిధ థియేటర్లలో విడుదలయ్యాయి. శ్రుతిహాసన్ నాయిక. నివేదా థామస్, అంజలి, అనన్య ఇతర పాత్రలలో నటించారు. దిల్‌రాజు, బోనీకపూర్ నిర్మాతలు. వేణుశ్రీరామ్ దర్శకుడు.
దిల్ఱాజు మాట్లాడుతూ,, ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ పెట్టాం, లంచ్, డిన్నర్ తర్వాత వున్నాయంటూ,, వకీల్‌సాగ్ టీజర్ ఆవిష్కరణ అనంతరం అభిమానులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
టీజర్ ఎలా3వుందంటే..
మిస్ పల్లవి ఆర్‌యు వర్జిన్...అని (నివేద)ను లాయర్ ప్రకాష్‌రాజ్.. కోర్టులో అడుగుతాడు.
వినపడేలా చెప్పండి.. ఆర్‌యు వర్జిన్.. అంటూ రెచ్చగొట్టేధోరణిలో అంటాడు.
ఆవెంటనే.
అసలు వాల్ళతో వెళ్ళకుండా వుండాల్సింది. అంటూ కారులో ముగ్గురు మహిళలు వెతుండడం,. తర్వాత ఒకరు ఆసుపత్రిలోకి సీరియస్‌గా రావడం..
ఆ తర్వాత
అమ్మాయిలకు పెద్ద బేక్‌గ్రౌండ్ ఏమీలేదుసార్.. ఉత్త మిడిల్ క్లాస్.అనే వాయిస్ వస్తుంది.
ఓ లాయర్ దగ్గరకువచ్చి,
ఎమర్జన్సీ బెయిల్ అప్లయి జేస్తే బెయిల్ వస్తుందని చెప్పారంటూ... ఇద్దరు మహిళలు వచ్చి అడుగుతారు.
ఎవరు చెప్పారంటూ.. ఆ లాయర్ అడుగుతాడు..
- వెంటనే.. సామానులు వేసుకుని దర్జాగా లారీలో కూర్చుని ప్రయాణిస్తున్న లాయర్‌సాబ్ (వపన్ కళ్యాణ్) కనిపిస్తాడు.
కేసు నెం. 7920. స్టేట్ పర్సన్ వేముల పల్లవి అంటూ... కోర్టులో బంట్రోత్ పిలుస్తాడు..
ఆ వెంటనే వపన్ లాయర్ కోట్ వేసుకుని సిద్ధమయ్యే సీన్..
ప్రత్యర్థి లాయర్ తరపున ఓ వ్యక్తిని లాయర్ వారు ఎలాంటివారు అని అడుగుతాడు.
ఆ అమ్మాయిలు చాలా ఫ్రెండ్లీ అనుకున్నా.. కానీ వీళ్ల తేడా అని తెలిసింది. అంటూ ముగ్గురు మహిళలపై ఫిర్యాదుచేస్తాడు.
ఎలా? అంటూ లాయర్ అనగానే. వాల్ళ చేష్టలు,, డ్రెస్‌లు అలా వున్నాయంటాడు.
ఆ తర్వాత
ఇలాంటి అమ్మాయిలు ఇలాగే జరుగుతుంది. అంటాడు.. అలా జరగదు జరగకూదంటూ.. వకీల్‌సాబ్ బోనులో వ్యక్తిని నిలదీస్తాడు. తదుపరి ఓ యాక్షన్ సీన్..
ఫైనల్‌గా... బోనులో నిలబడ్డ వ్యక్తని.. ఆర్.యు. వర్జిన్. అని వకీల్‌సాబ్ అడుగుతాడు..
అబ్జక్షన్ అంటూ.. ప్రతివాది లాయర్.. నంద (ప్రకాష్‌రాజ్) అనగానే..
మీరైతే అమ్మాయిలను అడగవచ్చు. మేం అబ్బాయిలను అడగకూడదా!
ఏం న్యాయం నందాజీ.. కూర్చోండి అంటాడు..
ఇది ఈ టీజర్.. ముగ్గురు మహిళలకు అన్యాయం జరిగితే పోరాడే లాయర్‌గా పవన్ నటించాడు.
ఇప్పటికే సెన్సేషనల్‌గా దూసుకుపోతుంది. రేపు థియేటర్లలో విడుదలయ్యాక ఎలా వుంటుందో చూడాలి.