Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజాంలో ప్రతి రోజు పండగే ఎంత కలెక్ట్ చేస్తుందో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (19:36 IST)
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సూపర్ హిట్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ప్రతిరోజు పండగే. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ బ్యానర్లపై యువ నిర్మాత బన్నీ వాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, ఎంటర్టైన్మెంట్ అంశాలు జోడించి తెరకెక్కిన ఈ సినిమాపై అన్ని ప్రాంతాల ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కలెక్షన్స్ నైజాం ఏరియాలో రూ.22 కోట్ల గ్రాస్, అలానే రూ.10.59 కోట్ల షేర్ అందుకుని, ఇంకా దిగ్విజయంగా దూసుకెళ్తోంది. 
 
ఒక్క నైజాంలోనే కాకుండా... ఈ సినిమా అన్ని ప్రాంతాలలో దిగ్విజయంగా దూసుకెళ్తోంది. తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తేజ్ తాతయ్యగా సత్య రాజ్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. మరి.. ఫుల్ రన్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments