ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

చిత్రాసేన్
బుధవారం, 5 నవంబరు 2025 (17:20 IST)
Pranav Mohanlal, DS Eere
ప్రణవ్ మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన సినిమా డీయస్ ఈరే. మిస్టరీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందింది. 'భూత కాలం', 'భ్రమ యుగం' ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంస్థలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది.
 
మలయాళంలో అక్టోబర్ 31న 'డీయస్ ఈరే' విడుదలైంది. నవంబర్ 7న (శుక్రవారం) పెయిడ్ ప్రీమియర్లతో తెలుగు వెర్షన్ విడుదల చేస్తున్నారు. నవంబర్ 8న (శనివారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో సినిమా విడుదల కానుంది. ఈ రోజు 'డీయస్ ఈరే' తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. 
 
ట్రైలర్ చూస్తే... ఓ విలాసవంతమైన భవంతి కనిపిస్తుంది. అందులో ఓ వ్యక్తి మహిళ హెయిర్ క్లిప్ పట్టుకుని కూర్చుంటాడు. ఆ తర్వాత వింత గొంతు ఒకటి వినబడుతుంది. 'ఆకాశం... భూమి... భూడిద అవ్వగా, లోకం కన్నీళ్ల భయంతో నిండుతుంది' అని ట్రైలర్ ముగిసింది. కథ ఏమిటి? అనేది రివీల్ చేయకుండా హారర్, థ్రిల్స్ ఎలిమెంట్స్ పుష్కంలంగా ఉన్నాయని చెప్పారు.      
 
మలయాళంలో డీయస్ ఈరేకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. వసూళ్లతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. కమల్ హాసన్ 'పుష్పక విమానం', 'నాయకుడు' నుంచి ధనుష్ 'రఘువరన్ బీటెక్' వరకు తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేసిన పరభాషా సినిమాలు భారీ విజయాలు సాధించడంతో పాటు విమర్శకుల - ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. ఆ కోవలో చేరుతుందని చెప్పవచ్చు. 
 
సినిమాలో సుష్మితా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, మనోహరి జాయ్, అరుణ్ అజికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వంలో రూపొందిన 'డియస్ ఈరే' చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను, అలా రూ 150 కోట్లు వదిలేసిన పవన్ కల్యాణ్

Python: తిరుమల రెండో ఘాట్‌లో పెద్ద కొండ చిలువ కలకలం (video)

టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.. చంద్రబాబు

చొక్కాపై చట్నీ వేసాడని అర్థరాత్రి కారులో తిప్పుతూ సిగరెట్లుతో కాల్చుతూ కత్తితో పొడిచి చంపేసారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments