Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

Advertiesment
Allu Aravind - Rashmika

చిత్రాసేన్

, బుధవారం, 5 నవంబరు 2025 (14:29 IST)
Allu Aravind - Rashmika
గీతా ఆర్ట్స్ బేనర్ లో అల్లు అరవింద్ నిర్మించిన ద గాళ్ ఫ్రెండ్ నిర్మించారు. రష్మిక మందన్నా కథానాయిక. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ సినిమా ప్రీరిలీజ్  వేడుక బుధవారంనాడు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రష్మిర రాలేదు. తను వేరే షూట్ లో బిజీగా వుండడంతో రాలేనని వీడియోను పంపింది. ఇక ఈ సినిమా గురించి అల్లు అరవింద్ సెన్సేషనల్ విషయాలు చెప్పారు. 
 
అల్లు అరవింద్ మాట్లాడుతూ,  ఈ సినిమా ద్వారా డబ్బు వస్తుందని కాదు. తీసినందుకు సాటిఫై గా వున్నా. 2021 లో రాహుల్ రవీంద్రన్ కథ చెప్పాడు. అది నా మైండ్ లో అలా తిరుగుతూనే వుంది. దర్శకుడు ఎప్పుడు కనిపించినా ఆ కథ ఏమైంది.. దానిని తీయాలని చెబుతుండేవాడిని. ఓ రోజు నిర్మాత ధీరజ్ ను నా దగ్గరకు తీసుకువచ్చాడు. ఈ సినిమా తీయడానికి కారణం ఏమంటే.. సమాజానికి కొన్ని చెప్పలేని విషయాలు చెప్పాలి. మనం కొన్ని నిజాలు తెలిసినా మాట్లాడుకోలేం. వాటిని సినిమా ద్వారా చెప్పాలి. ఆ కోరికతో సినిమా తీశా. రాహుల్ వంటి కమిటెండ్ పర్సన్ చెప్పినప్పుడు ఎంత ఉద్వేగంగా ఫీలయ్యారో అలానే తీశారు. సున్నితమైన మనసు కలగవారే ఈ కథను తీయగలరు.
 
ప్రతి యువతి, యువకుడు ఈ సినిమాను చూడాలి. ఇందులో ఎన్ని జోక్స్ లు, పాటలు, ఎంటర్ టైన్ మెంట్ట వున్నాయనేది కాదు సినిమా. మన అక్క, చెల్లె, మన పిన్ని ఇంట్లో ఆడవాళ్లు మనసుల్లో ఏముంటాయో  అనేది తెలుస్తుంది. గాళ్ ప్రెండ్ అనే టైటిల్ కాకుండా మరోటి చెప్పమంటే.. ఈ కథతో మీ జీవితమంతా నేనే.. అనే చెప్పే సినిమా కనుక అలా పెట్టాం. చెప్పే విషయం అతి ఘాటుగా వుంటుంది. 
 
కొంతమంది ఈ సినిమాలోని ట్విస్ట్ లు చూశాక రాత్రి పోరు. ప్రతి అమ్మాయి తనకు జరిగినా జరగకపోయినా తన స్నేహితురాలికి జరిగిందని పించేలా వుంటుంది. చివరి 20 నిముషాల తర్వాత వామ్మో.. అనిపించేలా వుంటుంది. నా సినిమాకు కొన్నిసార్లు 1.5 ఇచ్చిన సందర్భాలున్నాయి.  ఈ సినిమాకు రేటింగ్ తక్కువగా ఇస్తారని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అంత బోల్డ్ గా వుంటుంది.
 
రష్మిక మందన్నా తన పాత్రలో జీవించేసేది. ఈ సినిమా  రష్ చూశాక.. దసరాలో అలా వచ్చి  వెళ్ళిన కుర్రాడు ఈ సినిమాలో పెర్ ఫార్మెన్స్ అద్భుతంగా చేశాడు. దానితో నా సినిమాలకు పనిచేస్తున్నావ్ అని చెప్పాను. ఇలా దర్శకుడు కూడా తను అనుకున్నట్లు తీశాడు. ఈ సినిమా ఆడుతుందో లేదో కానీ మంచి సినిమా తీశానని గర్వంగా చెప్పగలను అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ramcharan: ఎ.ఆర్. రెహమాన్.. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్