Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dixit Shetty: ప్రేమ కథని మరో కోణంలో చూపించే ది గర్ల్ ఫ్రెండ్ - దీక్షిత్ శెట్టి

Advertiesment
Dixit Shetty, Rashmika Mandanna

చిత్రాసేన్

, సోమవారం, 3 నవంబరు 2025 (15:15 IST)
Dixit Shetty, Rashmika Mandanna
ఈ సినిమా యూత్ కోసమే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే మంచి క్యారెక్టర్స్ మా మూవీలో ఉన్నాయి. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అంటే స్మోకింగ్, డ్రింకింగ్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. సినిమాల్లో ఇలాంటివే చూస్తుంటాం. కానీ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అంటే వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అలాంటి ఒక ఎలిమెంట్ మా మూవీలో చూస్తారు. నేను ఆడియెన్ గా ఇలాంటి క్యారెక్టర్ ను లవ్ స్టోరీస్ లో చూడలేదు అని హీరో దీక్షిత్ శెట్టి అన్నారు.
 
రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి  జంటగా నటించిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు.  ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో దీక్షిత్ శెట్టి.
 
- దసరా మూవీ తర్వాత నాకు వచ్చిన అవకాశమిది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కోసం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నన్ను అప్రోచ్ అయ్యారు. రశ్మిక హీరోయిన్ గా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా చేస్తున్నాం. మీరు ఈ మూవీలో బాయ్ ఫ్రెండ్ రోల్ కోసం అనుకుంటున్నామని చెప్పి స్క్రిప్ట్ పంపారు. దసరా మూవీకి చేసిన ఇంటర్వ్యూస్ లో నన్ను చూసి రాహుల్ ఈ క్యారెక్టర్ కు నేను బాగుంటానని ఫిక్స్ చేసుకున్నారు. స్క్రిప్ట్ చదివాక నన్ను ఈ క్యారెక్టర్ కోసం ఎందుకు అనుకుంటున్నారో అర్థమైంది. నేను వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో స్క్రిప్ట్స్ వింటుంటా. ది గర్ల్ ఫ్రెండ్ లాంటి స్క్రిప్ట్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే ఈ సినిమాను తప్పకుండా చేయాలని అనుకున్నా.
 
- ఈ సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ ఎలా ఉండాలో దర్శకుడు రాహుల్ కు పూర్తి క్లారిటీ ఉంది. విక్రమ్ ఎలా ఉంటాడు, అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎలా మాట్లాడుతాడు అనేది రాహుల్ వివరంగా చెప్పేవారు. ఆయనకు ఉన్న క్లారిటీ వల్ల విక్రమ్ క్యారెక్టర్ ను పర్ ఫార్మ్ చేయడం నాకు ఈజీ అయ్యింది. అనేక లేయర్స్ ఉన్న ఈ పాత్ర కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. విక్రమ్ క్యారెక్టర్ లో ఏదో నెగిటివ్ ఉంది, ఇతను టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అనే ఇంప్రెషన్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అందరిలో కలుగుతోంది. అయితే విక్రమ్ నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఎప్పుడూ ఫీల్ కావొద్దని రాహుల్ చెప్పేవారు. నేను స్టేజ్, ఫిలిం స్కూల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఈ పాత్రకు ఎలా సన్నద్ధమవ్వాలో అలా అయ్యాను. ఏ సినిమా చేసినా స్క్రిప్ట్ నాకు పర్సనల్ గా నచ్చాలని భావిస్తా.
 
- ఇప్పటిదాకా మనం ఒక తరహాలో సాగే ప్రేమ కథా చిత్రాల్ని చూసి ఉంటాం. ఈ సినిమా ప్రేమ కథని మరో కోణంలో చూపిస్తుంది. మనం ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాలు చూస్తుంటాం. కానీ కొన్ని సినిమాల్లోని ఫీల్ మనతో పాటే క్యారీ అవుతుంది. మనం ఆ సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తాం. అలాంటి సినిమా ఇది. లార్జర్ దేన్ లైఫ్ మూవీస్ చూడటానికి బాగుంటాయి కానీ వాటిని మన రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకోలేం. "ది గర్ల్ ఫ్రెండ్"  సినిమాలోని పాత్రలు, సందర్భాలు మనం మన లైఫ్ లో రిలేట్ చేసుకునేలా ఉంటాయి. రశ్మిక ఈ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో "ది గర్ల్ ఫ్రెండ్"  లాంటి సినిమా కొన్నేళ్ల కిందట తాను చూసి ఉంటే తన జీవితం పట్ల తన దృక్పథం మరోలా ఉండేది అని చెప్పారు. 18 నుంచి 25 ఏళ్ల యూత్ ఈ సినిమా చూస్తే తమ లైఫ్ లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు.
 
- రశ్మిక పర్ ఫార్మెన్స్ చూశాక ఈ సినిమాకు మరో నాయిక న్యాయం చేయలేదేమో అనిపించింది. తను అంత బాగా పర్ ఫార్మ్ చేసింది. మీరు మూవీ చూస్తున్నంత సేపు రశ్మిక కనిపించదు, భూమా అనే పాత్రనే కనిపిస్తుంది. మా సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే యానిమల్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. రశ్మికతో కలిసి నటిస్తున్నప్పుడు ఒక స్టార్ తో ఉన్నామనే ఫీల్ కలగలేదు. తను చాలా ఫ్రెండ్లీగా యూనిట్ అందరితో ఉండేది.
 
- రాహుల్ రవీంద్రన్ మంచి రైటర్, డైరెక్టర్. అంతకంటే మంచి మనిషి. సెట్ లో ఎవరినీ హర్ట్ చేయకుండానే తనకు కావాల్సిన వర్క్ తీసుకున్నారు. డైరెక్టర్స్ అంటే ఇలా కూడా ఫ్రెండ్లీగా అందరితో వర్క్ చేయించుకోవచ్చని రాహుల్ ను చూశాక తెలిసింది. స్క్రిప్ట్, క్యారెక్టర్స్ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది.
 
- సినిమా షూటింగ్ టైమ్ లో అరవింద్ గారు రశెస్ చూసి పిలిచారు. నేను సరిగ్గా నటించడం లేదేమో, ఏమంటారో అని వెళ్లా. ఆయన అప్రిషియేట్ చేసి నెక్ట్స్ మూవీకి అడ్వాన్స్ ఇచ్చారు. సుదీర్ఘ అనుభవం ఉన్న అలాంటి గొప్ప ప్రొడ్యూసర్ నుంచి ప్రశంసలు రావడం, మరో సినిమాకు అడ్వాన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. అరవింద్ గారి ప్రశంసలు కెరీర్ బిగినింగ్ లో ఉన్న నాలాంటి యాక్టర్ కు ఎంతో ఆత్మవిశ్వాసం ఇచ్చాయి.
 
- నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉంది. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. బాగా నటిస్తే తెలుగు ఆడియెన్స్ ఏ భాషలో నటుడిని అయినా ఆదరిస్తారు. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ విద్య, ధీరజ్ మా అందరికీ కావాల్సినంత సపోర్ట్ ఇచ్చారు. హేషమ్ ఇచ్చిన మ్యూజిక్ "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాకు హైలైట్ అవుతుంది. ఏం జరుగుతుంది అనే పాట నా ఫేవరేట్ సాంగ్. ఈ సినిమా నా కెరీర్ లో చేసిన బెస్ట్ ఫిలిం అని చెప్పగలను.
 
- నేను కన్నడలో చేసిన బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి సినిమాను తెలుగులో ఈ నెల 21న విడుదల చేయబోతున్నాం. తెలుగులో షబనా అనే సినిమా చేస్తున్నా. ఇది కాకుండా కేజేక్యూ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. టైటిల్ ఖరారు కాని ఇంకో ప్రాజెక్ట్ లోనూ నటిస్తున్నా. కన్నడలో శివన్నతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నా, మలయాళంలో చేస్తున్న ఏంజెల్ నెం.16 రిలీజ్ కు రెడీ అవుతోంది. తమిళంలో ఒక మూవీ షూటింగ్ లో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..