Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

Advertiesment
Rahul Ravindran, Chinnay

చిత్రాసేన్

, మంగళవారం, 4 నవంబరు 2025 (13:02 IST)
Rahul Ravindran, Chinnay
నటుడు, ది గాళ్ ఫ్రెండ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన వివాహం గురించి సోషల్ మీడియాలో ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. దానికి నెటిజన్లు భలేగా కామెంట్లు చేస్తున్నారు. మా వివాహం తర్వాత, నేను నా భార్య చిన్నయి కి మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది ఆమె ఇష్టం అని చెప్పాను. నేను దానిని ధరించకూడదని కూడా సూచించాను, ఎందుకంటే పురుషులకు వివాహం జరిగినట్లు కనిపించే సంకేతాలు లేకపోవడం అన్యాయం, కానీ స్త్రీలకు వివాహం జరగాలి.. అంటూ పోస్ట్ చేశారు. 
 
దీనికి నెటిజన్లు..  అసలు ఎలా భరిస్తావయ్యా ఈమెని నువ్వు? లేక నువ్వు కూడా ఇదే మనస్తత్వం.. ఏమో లే.. అయినా దండాలు సామీ నీకు. మగాళ్ల మీద ఇంత ద్వేషం పెట్టుకుని మళ్ళీ ఒక మగాణ్ణే పెళ్లి చేసుకుంది చూడండి అదే ద్వంద్వ వైఖరి అంటే అని చమక్కలు విసిరారు. 
 
ఇక రష్మిక మందన్నా తో రాహుల్ దర్శకత్వం వహించిన ది గాళ్ ఫ్రెండ్ లోని కథాంశం కూడా ఇంచుమించు కొద్దిగా అలానే వుంటుందా? అనేది చర్చ జరుగుతోంది. సినిమాలో ప్రేమికులు, పెండ్లి తర్వాత ఇలాంటి చర్చ పెడుతున్నావా? అంటూ రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. సినిమా రిలీజ్ కు ముందు తన పెండ్లి గురించి రాహుల్ ప్రస్తావించడం పబ్లిసిటీగా అనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్