Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Advertiesment
Rashmika Mandanna, Dixit Shetty

చిత్రాసేన్

, శుక్రవారం, 31 అక్టోబరు 2025 (10:16 IST)
Rashmika Mandanna, Dixit Shetty
రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి  జంటగా నటించిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
 
ఈ రోజు ఈ సినిమా నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా కపిల్ కపిలన్ పాడారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేశారు.  పాట ఎలా ఉందో చూస్తే ...'కురిసే వాన తడిపేయాలన్న భూమే ఏదో , సరదా పడుతూ పురి విప్పేస్తున్న నెమలే ఏదో, ఓ నీలి మేఘం, పెంచింది వేగం, ఆ జాబిలమ్మ చెంత చేరి వంతపాడి, కమ్మితే మైకం, లాయి లాయి లాయిలే..' అంటూ వినగానే ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. మెమొరబుల్ లవ్ సాంగ్ గా 'కురిసే వాన..' లవర్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ కు గుర్తుండిపోనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది