Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సిద్ధార్థ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (12:12 IST)
హీరో సిద్దార్థ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను నటించిన కొత్త చిత్రం 'చిత్త'. శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో సిద్ధార్థ్ గురువారం బెంగుళూరు నగరంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీన్ని కొన్ని కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. తమ కావేరీ ఉద్యమానికి మద్దతు తెలుపాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో విలేకరుల సమావేశం నిర్వహించకుండా సిద్ధార్థ్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. చేతులు జోడించి, థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి సిద్ధార్థ్ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 
 
ఈ వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. హీరో సిద్ధార్థ్‌కు సారీ చెప్పారు. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ సమస్య దశాబ్దాలుగా ఉందని, ఇన్నేళ్ల కాలంలో సమస్య పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులను ప్రశ్నించలేదని, సమస్య పరిష్కారం కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురాలేని కుంటి ఎంపీలను ప్రశ్నించకుండా నిస్సహాయ సామాన్యులు, కళాకారులను చిత్రహింసలకు గురిచేయడం తప్పని, అందుకు కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు చెపుతున్నట్టు తన ఎక్స్ ఖాతాలో ప్రకాష్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments