Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామన్న యూత్ అభయ్ నా ఫేవరేట్ యంగ్ యాక్టర్ : హీరో సిద్ధార్థ్

Siddharth, Abhay
, గురువారం, 7 సెప్టెంబరు 2023 (13:34 IST)
Siddharth, Abhay
యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో సిద్ధార్థ్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన “రామన్న యూత్” సినిమా ట్రైలర్ బాగుందన్న హీరో సిద్ధార్థ్ ..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. 
 
హీరో సిద్దార్ధ్  మాట్లాడుతూ - “రామన్న యూత్” టైటిల్ క్యాచీగా ఉంది. అభయ్ నా ఫేవరేట్ యంగ్ యాక్టర్. తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిలింలో అభయ్ యాక్టింగ్ నన్ను బాగా ఆకట్టుకుంది. తరుణ్ కు ఫోన్ చేసి మాట్లాడా. అభయ్ లో మంచి యాక్టర్, రైటర్ ఉన్నాడని చెప్పాడు. తర్వాత నా చిన్నా సినిమాలో ఓ కీ రోల్ అభయ్ చేశాడు. ఈ సినిమాలో ఒక కథను కాకుండా తను లైఫ్ లో చూసిన ఊరి అనుభవాలను తెరకెక్కించాడు. ట్రైలర్ చూశాను ఫన్ ఉంది. అలాగే ఫన్ వెనక ఒక ఎమోషన్ ఉంది. ఎక్కడైనా యూత్ గెలవాలి. ఈ సినిమా నెక్ట్ వీక్ థియేటర్ లోకి వస్తోంది. థియేటర్ లోనూ రామన్న యూత్ గెలవాలి. నేను థియేటర్ లో ఈ సినిమా చూస్తా. మిమ్మల్ని చూడమని కోరుతున్నా. ఎందుకంటే నేను ఇలా చిన్నవాడిగా ఇండస్ట్రీకి వచ్చాను. ఇలాంటి యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయమని కోరుతున్నా. అన్నారు.
 
హీరో, దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ - మా సినిమా ట్రైలర్ విడుదల చేసిన హీరో సిద్ధార్థ్ గారికి కృతజ్ఞతలు. ఒక ఊరిలో రాజకీయ నాయకుడిగా ఎదగాలని రాజు అనే యువకుడు చేసిన ప్రయత్నాలు అతని జీవితాన్ని ఎలా మార్చాయి అనేది సినిమాలో ఆకట్టుకునేలా చూపిస్తున్నాం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ ఇది. ఈ నెల 15న “రామన్న యూత్” చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ట్రైలర్ లాగే సినిమా కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
 
నటీనటులు :అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్.. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతారా?