Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్.. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతారా?

Advertiesment
Kiran Rathod
, గురువారం, 7 సెప్టెంబరు 2023 (13:27 IST)
Kiran Rathod
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ మొత్తం హౌస్‌కి రసవత్తరంగా ప్రారంభమైంది. బిగ్ బాస్ తొలి రోజు నుంచే నామినేషన్ల ద్వారా కంటెస్టెంట్‌లలో గందరగోళం సృష్టించింది. వారి ప్రవర్తన, ఆట ఆధారంగా ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. 
 
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించగా.. వారంతా ప్రస్తుతం హౌస్ మెంబర్స్ కాదని, కేవలం కంటెస్టెంట్స్ మాత్రమేనని సెప్టెంబర్ 6వ రోజు 3 ఎపిసోడ్‌లో బిగ్ బాస్ తెలిపారు. కానీ సీజన్ ప్రారంభమైన మొదటి రోజు నుండి పోటీదారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

నిజానికి, బిగ్ బాస్‌లో ప్రేక్షకులందరూ ఎక్కువగా ఆనందించేది నామినేషన్ల ప్రక్రియ. తొలి రోజైన సోమవారం (సెప్టెంబర్ 4) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ, అది సెప్టెంబర్ 5తో ముగిసింది.
 
బిగ్ బాస్ తెలుగు 7 మొదటి వారం నామినేషన్లలో మొత్తం 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో రాతిక, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతం కృష్ణ, ప్రిన్స్ యావర్, దామిని, షకీలా, కిరణ్ రాథోడ్ ఉన్నారు. ప్రియాంక, అమర్‌దీప్, శివాజీ, అత సందీప్, టేస్టీ తేజలను ఎవరూ నామినేట్ చేయకపోవడంతో సేఫ్ జోన్‌లో ఉన్నారు. 
 
నామినేట్ చేయబడిన పోటీదారులకు ఓటింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 5 రాత్రి నుండి ప్రారంభమైంది. హాట్‌స్టార్ యాప్ నుంచి మిస్డ్ కాల్ ద్వారా ఓటు వేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సీజన్‌లో ఒక్కో పోటీదారునికి ఒక ఓటు మాత్రమే వేయాలనే కొత్త విధానాన్ని నిర్వాహకులు ప్రవేశపెట్టారు.
 
బిగ్ బాస్ 7 తెలుగు మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే మొదటి వారం ఎలిమినేషన్ లేకపోతే ఆమె సేఫ్ కావచ్చు.
 
కిరణ్ రాథోడ్‌కి తెలుగు అస్సలు రాదు, దానివల్ల ఇతర పోటీదారులు ఏమి మాట్లాడుతున్నారో ఆమెకు అర్థం కాలేదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు కూడా ఆమెకు అర్థం కాలేదు. పైగా కిరణ్ రాథోడ్‌కి తెలుగులో పెద్దగా ఆదరణ లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓజీలో పవన్‌తో నటించడంపై బిగ్ బాస్ 7 కంటిస్టెంట్ హ్యాపీ