Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇట్స్ కన్ఫామ్... "సాహో" తర్వాత ప్రభాస్ పెళ్లి

'బాహుబలి' ప్రభాస్ ఓ ఇంటివాడుకానున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న "సాహో" చిత్రం షూటింగ్ తర్వాత పెళ్ళి చేసుకోనున్నాడు. ఇందులోభాగంగా, అమ్మాయి కోసం ఆయన పెదనాన్న, సినీ హీరో కృష్ణంరాజు గాలిస్తున్నారట. ఈ విష

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (15:14 IST)
'బాహుబలి' ప్రభాస్ ఓ ఇంటివాడుకానున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న "సాహో" చిత్రం షూటింగ్ తర్వాత పెళ్ళి చేసుకోనున్నాడు. ఇందులోభాగంగా, అమ్మాయి కోసం ఆయన పెదనాన్న, సినీ హీరో కృష్ణంరాజు గాలిస్తున్నారట. ఈ విషయాన్ని ప్రభాసే స్వయంగా చెప్పాడట.
 
ప్రభాస్‌ పెళ్లి విషయమై ఇటీవల ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. పెళ్లి చేసుకోమని తాను కూడా ప్రభాస్‌ను బలవంతపెడుతున్నానన్నారు. కానీ ప్రభాస్‌ మాత్రం త్వరలో చేసుకుంటానని చెప్తూనే ఉన్నాడని చెప్పారు. అలాగని ప్రతిసారి పెళ్లి చేసుకోమని చెప్పడానికి ప్రభాసేమీ చిన్నపిల్లాడు కాదన్నారు.
 
ఈ వ్యాఖ్యలు ప్రభాస్‌కు బాగా గుచ్చుకున్నట్టు తెలుస్తున్నాయి. దీంతో 'సాహో' చిత్రం విడుదలైన తర్వాత పెళ్లి చేసుకోనున్నట్టు తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. మరోవైపు, తన అభిమానులు కూడా తమ బాహుబలి ఓ ఇంటివాడైతే చూడాలని ఎంతో ముచ్చటపడుతున్న విషయం తెల్సిందే. 
 
కాగా, సాహో చిత్రం సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆయన పెళ్లి చేసుకుంటారో… లేక మళ్లి వాయిదా వేస్తారో వేచి చూడాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments