Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌భాస్ మూవీకి స్టోరీ ఇచ్చిన విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల అబుదాబిలో ఈ చిత్రం కోసం భారీ యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించారు. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా రూపొందుత

Advertiesment
ప్ర‌భాస్ మూవీకి స్టోరీ ఇచ్చిన విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు
, మంగళవారం, 26 జూన్ 2018 (14:17 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.  ఇటీవ‌ల అబుదాబిలో ఈ చిత్రం కోసం భారీ యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించారు. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ‌తో ఓ భారీ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
అది ఏంటంటే... యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో 1970 కాలంలో సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని. ఈ సినిమా క‌థ‌ను విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి అందించార‌ని. ఈ క‌థ‌తో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి సినిమా చేయాల‌నుకున్నార‌ట‌. కానీ... వ‌ర్క‌వుట్ కాలేద‌ట‌. ఇది తెలిసి డైరెక్ట‌ర్ రాధాకృష్ణ ఆ క‌థ ప్ర‌భాస్‌కి బాగుంటుందని త‌న‌కు ఇవ్వ‌మ‌ని అడ‌గ‌డం.. దీనికి చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఓకే చెప్ప‌డం జ‌రిగింద‌ని టాక్ వినిపిస్తోంది. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి క‌థ‌లు చాలా వైవిధ్యంగా ఉంటాయి. దీంతో ఈసారి ఎలాంటి క‌థ‌ను రాసారో..? అనే ఆస‌క్తి పెరిగింది. ఈ భారీ సినిమాని ఆగ‌ష్టులో ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేయింబవుళ్లూ శ్రమిస్తూ ఎంజాయ్ చేస్తున్న చై-శ్యామ్