Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేయింబవుళ్లూ శ్రమిస్తూ ఎంజాయ్ చేస్తున్న చై-శ్యామ్

టాలీవుడ్ హీరోయిన్ సమంత... అక్కినేని ఇంటికెళ్లిన వేళావిశేషమో ఏమోగానీ... వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయి. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగ చైతన్యను ఆమె పెళ్లాడింది.

రేయింబవుళ్లూ శ్రమిస్తూ ఎంజాయ్ చేస్తున్న చై-శ్యామ్
, మంగళవారం, 26 జూన్ 2018 (13:05 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత... అక్కినేని ఇంటికెళ్లిన వేళావిశేషమో ఏమోగానీ... వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయి. సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగ చైతన్యను ఆమె పెళ్లాడింది.
 
అయితే, పెళ్ళి త‌ర్వాత తొలిసారి శివ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. హ‌రీష్ పెద్ది, సాహు గార‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. "ప్రేయ‌సి" అనే టైటిల్ ప‌రిశీలిస్తుండ‌గా, ఈ జంట పెళ్లి తర్వాత ఫస్ట్‌ టైమ్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. 
 
ఇందులో నాగచైతన్య క్రికెటర్‌ పాత్రను పోషించనున్నారన్నది ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. అయితే వీరు సినిమాల‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అడ‌పాద‌డ‌పా యాడ్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వేర్వేరుగా యాడ్‌లో న‌టించిన స‌మంత‌, చైతూలు తొలిసారి బిగ్ బ‌జార్‌కి సంబంధించిన యాడ్‌లో కలిసి న‌టించారు. 
 
ఇందుకోసం ముంబై వెళ్లిన దంప‌తులు వ‌ర్క్‌తో బిజీగా ఉంటూ వారాంతపు సెలవులను ఎంజాయ్ చేశారు. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పెళ్ళి చూపులు వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన త‌రుణ్ భాస్క‌ర్ వీరిద్ద‌రితో ఓ యాడ్‌ని చిత్రీకరించ‌గా, వివేక్ సాగ‌ర్ సంగీతం అందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ భార్యకు పవన్ బెస్ట్ విషెస్.. హ్యాపీగా లేనంటున్న రేణు