Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహో ఆ క్ల‌బ్‌లో చేరాడా..?

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (18:28 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమా ఇటీవ‌ల రిలీజైన విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కుడు సుజిత్, యు.వి.క్రియేష‌న్స్ రెండు సంవ‌త్స‌రాలు ఎంతో క‌ష్ట‌ప‌డి రూపొందించిన ఈ సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్స్ మాత్రం బాగానే రాబ‌డుతుంది. ముఖ్యంగా బాలీవుడ్లో రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం విశేషం. 
 
రెబల్ స్టార్ సాహో సినిమాతో అమెరికాలో మరోసారి ప్రభాస్ తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించాడు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన సాహో 3 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. ఓవర్సీస్‌లో భారీగా విడుదలైన సాహో ప్రీమియర్స్ తోనే సాలీడ్ కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇక ప్రభాస్ గత సినిమాలు కూడా యూఎస్‌లో మంచి వసూళ్లను రాబట్టయి. 
 
ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి ఫస్ట్ పార్ట్ 6.9 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఇక ఆ కథకు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి సెకండ్ పార్ట్ 12 మిలియన్ డాలర్స్‌ని అందుకుంది.
 
ఇక ఇప్పుడు సాహో కూడా అదే తరహాలో కలెక్షన్స్‌ని అందుకుంటోంది. 3 మిలియన్ డాలర్స్‌ని అందుకున్న సాహో ఆదివారం పాజిటివ్ ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అయ్యింది. సుజిత్ డైరెక్ట్ చేసిన సాహో చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. మ‌రి... ఫుల్ ర‌న్లో ఇంకెంత క‌లెక్ట్ చేయ‌నుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ - తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ ప్రారంభం

Mana Bathukamma 2025 Promo: మన బతుకమ్మ పాట ప్రోమో విడుదల (video)

భారత్ - పాక్‌ల మధ్య కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి : టర్కీ ప్రెసిడెంట్

Heavy Rains: సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు

భారత్ - పాక్‌తో సహా మొత్తం ఏడు యుద్ధాలు ఆపాను.. శాంతి బహుమతి ఇవ్వాలి : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments