Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీ కోసం అన్ని సెట్స్ వేస్తున్నారా..?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (19:52 IST)
బాహుబ‌లి ప్ర‌భాస్ సాహో సినిమాతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాపై ఎన్నో అంచ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో నిరాశ‌ప‌డిన అభిమానులు ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. 
 
జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్‌తో ప్ర‌భాస్ ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీని గోపీకృష్ణా మూవీస్, యు.వి.క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని 180 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించనున్నట్టు సమాచారం. 
 
1960 కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దాదాపు 25 సెట్స్ నిర్మించినట్టు తెలిసింది. ప్రతి సెట్ కూడా అద్భుతంగా ఉందంటున్నారు. హైదరాబాద్ లోనే ఈ సెట్స్ వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు 30 శాతం షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రెస్ట్ తీసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొంటార‌ట‌.
 
అయితే... 25 సెట్స్ వేస్తున్నార‌నేది హాట్ టాపిక్ అయ్యింది. ఈ సెట్స్ అన్నింటినీ హైద‌రాబాద్ లోనే వేస్తుండ‌డం విశేషం. సాహో ఆక‌ట్టుకోలేక‌పోయినా... ప్ర‌భాస్ కొత్త సినిమా బ‌డ్జెట్ విష‌యంలో మాత్రం రాజీప‌డ‌డం లేద‌ట‌. ఇంకా చెప్పాలంటే.... విజువ‌ల్ వండ‌ర్ అనేలా ఈ సినిమాని రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. ప్ర‌భాస్ అభిమానులు ఆశ‌లు అన్నీ ఈ సినిమా పైనే. మ‌రి...ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ఏం చేస్తాడో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

క్లాస్‌ రూంలో ప్రొఫెసర్ డ్యాన్స్ - చప్పట్లు - ఈలలతో ఎంకరేజ్ చేసిన విద్యార్థులు!!

యూపీలో దారుణం: నలుగురు పిల్లల్ని గొంతుకోసి చంపేశాడు.. ఆపై ఉరేసుకున్నాడు..

ఒకరితో పెళ్లి - ఇంకొకరితో ప్రేమ - కాన్ఫరెన్స్ కాల్‌లో దొరికేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments