Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ టైమ్‌లో నాగ్ ఆ.. ప్ర‌యోగం చేస్తున్నారా..?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (18:42 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవ‌ల మ‌న్మ‌థుడు 2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ఫ్లాప్ అయిన విష‌యం తెలిసిందే. దీని త‌ర్వాత బంగార్రాజు మూవీ చేయాల‌నుకున్నాడు కానీ... ఈ సినిమా క‌థపై ఎంత‌గా వ‌ర్క్ చేసిన‌ప్ప‌టికీ నాగ్ ఎందుక‌నో ధైర్యం చేయ‌లేక‌పోతున్నాడు.
 
అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు బంగార్రాజు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. రేపో మాపో బంగార్రాజు సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటుంటే... ఓ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌నున్నాడని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
ఇంత‌కీ కొత్త డైరెక్ట‌ర్ ఎవ‌రంటే... మ‌హేష్ మహర్షి సినిమా రైటర్లలో ఒకరైన సోలోమన్ చెప్పిన కథ విని, అతనికే డైరక్షన్ అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మించే అవకాశం వుంది.
 
ప్రస్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించాలి అనుకుంటున్నార‌ట నాగ్. మ‌రి.. ఈ సినిమాతో అయినా నాగ్‌కి స‌క్స‌ెస్ వ‌స్తుందేమో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments