Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభాస్ అంటే పిచ్చి.. ఛాన్స్ దొరికితే... పాయల్ రాజ్‌పుత్

Advertiesment
ప్రభాస్ అంటే పిచ్చి.. ఛాన్స్ దొరికితే... పాయల్ రాజ్‌పుత్
, బుధవారం, 11 సెప్టెంబరు 2019 (15:18 IST)
'ఆర్ఎక్స్ 100' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన నార్త్ ఇండియన్ భామ పాయల్ రాజ్‌పుత్. తాను నటించిన తొలి చిత్రంలోనే అందాలను ఆరబోసి, కుర్రకారుకు కునుకులేకుండా చేసింది. తద్వారా హాట్ భామగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
 
ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. తాజాగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 'వెంకీమామ', రవితేజ నటించే 'డిస్కోరాజా' చిత్రాలతో పాటు ఆమె 'ఆర్‌డి‌ఎక్స్ లవ్' సినిమా కూడా చేస్తోంది. ఈ సినిమా టీజర్లో ఆమె భారీగా అందాలను ఆరబోసి అంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది.
 
'ప్రభాస్ .. విజయ్ దేవరకొండలలో మీకు ఎవరు ఎక్కువ హాట్‌గా అనిపిస్తారు? ఎవరితో కలిసి నటించాలని వుంది?' అనే ప్రశ్న ఎదురైంది. అందుకు పాయల్ స్పందిస్తూ .. "నాకు ప్రభాస్ అంటే ఎక్కువ ఇష్టం. అమితమైన పిచ్చి. ఆయనలో ఏదో స్పార్క్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ .. సహజంగా అనిపించే స్టైల్ అంటే నాకు మరింత ఇష్టం. ఛాన్స్ రావాలేగానీ.. ఆయనతో కలిసి నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. 
 
వెంకీ మామకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.. 
విక్టరీ వెంకటేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా 'వెంకీమామ' టీమ్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు.
webdunia
 
పండగ సందర్భానికి తగ్గట్టే ఈ పోస్టర్ కలర్ఫుల్‌గా బ్రైట్‌గా ఉంది. వెంకీ.. చైతు ఇద్దరూ అచ్చమైన తెలుగింటి సంప్రదాయంలో పంచెకట్టులో మెడలో కండువా వేసుకొని కనిపించారు. కాళ్ళకు తోలు చెప్పులు.. కళ్ళకు చలువ కళ్ళజోడు ధరించి ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని చలాకీగా నవ్వుతూ నడిచి వస్తున్నారు.
 
ఈ పోస్టర్ చూస్తుంటేనే దగ్గుబాటి మామ అక్కినేని అల్లుడు కలిసి బాక్సాఫీసును షేక్ చేయడానికి వస్తున్నట్టుగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి ఈ పోస్ట‌ర్ మ‌రింత ఆస‌క్తిని క‌లిగించింది అన‌డంతో ఎలాంటి సందేహం లేదు.

ఐతే వెంకీ సరసన నటిస్తున్న పాయల్ రాజ్ మాత్రం వెంకీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. వరుసబెట్టి అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ క్లీవేజ్ షో చేస్తూ బెదరగొడుతోందట. ఇలాంటి ఇమేజ్ చంకనెత్తుకుని వెంకీమామతో వస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారోనని వెంకీ మామ బెంబేలెత్తిపోతున్నాడట. మ‌రి... వెంకీ - చైతు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజశేఖర్ సరసన అమలా పాల్.. ఆడై తర్వాత టాలీవుడ్‌లోకి...