Webdunia - Bharat's app for daily news and videos

Install App

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

దేవీ
సోమవారం, 9 జూన్ 2025 (15:17 IST)
Prabhas, Manchu Vishnu
విష్ణు మంచు 'కన్నప్ప' విడుదలకు సిద్ధమవుతోంది. డాక్టర్ ఎం. మోహన్ బాబుతో పాటుగా  ఈ చిత్రంలో విష్ణు మంచు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
 
ఈ సందర్భంగా  విష్ణు మంచు మాట్లాడుతూ, నాకు మా నాన్న దేవుడు.. ఆయన లేకపోతే నేను లేను. అందుకే మా నాన్నకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్రహ్మానందం గారు ధైర్యం చెబుతూనే ఉన్నారు. నాకు ఫోన్ చేసి సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది.. ధైర్యంగా ఉండమని ప్రతీ నిమిషం చెబుతూ వచ్చారు. ప్రభుదేవా ఒక కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, డైరెక్టర్‌గా సక్సెస్ చూసారు. ముఖేష్ రిషి, శివ బాలాజీ, రఘుబాబు.. ప్రతీ ఒక్కరికి పేరు పేరునా థ్యాంక్స్. డైరెక్టర్ ముఖేష్ సింగ్ భాష రాకపోయినా 'కన్నప్ప' సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారు.
 
నాన్న కోసం ప్రభాస్ ఈ సినిమా చేసారు కానీ, నాకోసం చేయలేదు. అతనికి ఈ క్యారక్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కాలంలోనూ పెద్దల పట్ల గౌరవం, స్నేహానికి విలువ ఉందనడానికి ప్రభాస్ ఒక ఉదాహరణ. మీరందరూ అతని స్టార్ డమ్‌ని కాదు, అతని వ్యక్తిత్వాన్ని ప్రేమించండి అని మంచు విష్ణు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments