Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నప్ప నుంచి అరియానా, వివియానా పాడిన శ్రీ కాళ హస్తి పాట

Advertiesment
Ariana, Viviana

దేవీ

, బుధవారం, 28 మే 2025 (16:09 IST)
Ariana, Viviana
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాను జూన్ 28న రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్‌లో విష్ణు మంచు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఆల్రెడీ యూఎస్‌లో ‘కన్నప్ప’ టూర్‌ని ముగించుకుని వచ్చారు.  తాజాగా మోహన్ బాబు మనవరాళ్లు, విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా పాడిన ‘శ్రీకాళ హస్తి’ పాటను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ పాట పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
 
అరియానా, వివియానా పాడిన ఈ ప్రత్యేకమైన పాటను బుధవారం నాడు కాశీ విశ్వనాథ ఆలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మోహన్ బాబు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, రచయితలు తోట ప్రసాద్, ఆకుల శివ, అర్పిత్ రాంకా వంటి వారు పాల్గొన్నారు. స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచిన ఈ పాట భక్తి, భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఉంది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ సాహిత్యం శ్రీ కాళ హస్తి దైవిక వారసత్వాన్ని అందంగా వివరిస్తుంది. 
 
విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా ఈ పాటకు ప్రాణం పోస్తూ ప్రతీ ఒక్కరి హృదయాల్ని తాకేలా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో అరియానా, వివియానా కనిపించిన విజువల్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.  సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించిన ఓ విజువల్ వండర్‌గా అందరినీ మెప్పించనుంది. ఈ పాట రాబోయే తరాలకు ‘శ్రీ కాళ హస్తి’ ఆలయ విశిష్టతకు చిహ్నంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tej Sajja: మిరాయ్ టీజర్ లో మంచు మనోజ్ పాత్ర హైలైట్