తన బేనర్ లో తనే హీరోగా కన్నప్ప సినిమా చేసిన మంచు విష్ణు మరో క్రాఫ్ట్ లో కూడా ప్రవేశించారు. తను ఫైట్ మాస్టర్ గా మారాడు. ఈ విషయాన్ని నేడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ప్రమోషన్ యాత్ర సందర్భంగా తిరుగుతున్న మంచు విష్ణు కన్నప్ప స్టోరీస్ లో భాగంగా ఒక్కో విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. అందులో భాగంగా కన్నప్ప లో యాక్షన్ కోసం ఎంత కష్టపడిందో గ్లింప్స్ ను విడుదల చేశారు.
చాలా మందికి తెలియదు. నేను నటుడిగా మారడానికి ముందు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాను. LAలో స్టంట్‌మ్యాన్‌గా పనిచేశాను. నేను తెలుగు స్టంట్ యూనియన్ సభ్యుడిని కూడా అని గర్వంగా చెప్పగలను. కన్నప్ప షోరన్నర్‌గా, చాలా యాక్షన్ సన్నివేశాలను నేనే డిజైన్ చేసాను. వాటికి ప్రాణం పోసినందుకు కెచా మాస్టర్‌కు చాలా ధన్యవాదాలు. హర్‌హర్‌మహాదేవ్ అంటూ దేవుని ఆశీస్సులు కోరుతున్నారు.
ఇతిహాసానికి సాక్ష్యం కన్నప్ప తీశామనీ, ఇంతకుముందు కన్నప్ప పేరుతో సినిమాలు వచ్చినా ఎవరూ టచ్ చేయని అంశాన్ని మా కన్నప్పలో చూపించబోతున్నామని అన్నారు. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదలకానుంది.