హను మాన్ చిత్ర హీరో తేజ సజ్జ నటిస్తున్న చిత్రం మిరాయి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ ను నిన్న రాత్రి రామానాయుడు స్టూడియోలో ప్రదర్శించారు. యుగాలనాటి కథగా చూపించారు. నేటి యుగానికి దేవుడు రాడు. ఓ ఆయుధం వస్తుంది. అదే మిరాయ్ అంటూ ఓ సాధువు పలికే డైలాగ్ తో పవర్ ఫుల్ గా హీరో తేజ కనిపిస్తాడు. మిరాయి అంటే ఏమిటి? ఆ ఆయుధం గురించి కథే ఈ చిత్రంలో చూడాల్సిందే అన్నట్లుగా వుంది.
ఇంతకు ముందు షూటింగ్ కి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు ఈ టీజర్ మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్పాలి. మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా వుంది. విజువల్స్ మెయిన్ గా ఇవి గ్రాఫిక్స్ తో సరికొత్తగా కనిపించేలా టీజర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ, ఇందులో నా పాత్ర ఎంత పవర్ ఫుల్ అంతకుమించి మనోజ్ పాత్ర వుంటుంది. దర్శకుడు అద్భుతంగా డిజైన్ చేశారని తెలిపారు. చివరి లాస్ట్ షాట్ లో రాముని రాకపై చూపించిన విజువల్ బాగుంది. మిరాయ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సరికొత్త కథతో రాబోతోంది. సెప్టెంబర్ 7న సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.