సలార్ పూజాకార్యక్రమంలో యంగ్ రెబల్ స్టార్.. కన్నడ స్టార్ యష్ లు సందడి చేశారు. శుక్రవారం ఈ అరుదైన సన్నివేశం హైదరాబాద్‌లో జరిగింది. ప్రభాస్ హీరోగా హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సలార్`. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇక ఇద్దరూ ప్యాన్ ఇండియా స్టార్స్ కలిస్తే కెమెరాలు కామ్‌గా ఉంటాయా.. క్లిక్ మనిపించారు. ప్రస్తుతం 'సలార్' ప్రారంభోత్సవ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం సలార్. ఈ మూవీ పూజా కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్‌గా జరిగింది.
prabhas
ఈ కార్యక్రమంలో హోంబలే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగండూర్, కేజీఎఫ్ ఫేం యశ్, ప్రభాస్ తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరగండూర్, ప్రభాస్ సార్ కు ధన్యవాదాలు. ఈ రోజు మాతో ఉన్నందుకు నా రాకీ (యశ్)కు ధన్యవాదాలు. సలార్ మిమ్మల్ని నిరాశపర్చదు. మాకు మీ ప్రేమ, మద్దతు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు.