కన్నడ సెన్సేషనల్ స్టార్ యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, బాలీవుడ్ నటి రవీనా టాండన్, రామికా సేన్ వంటి అగ్ర నటీనటులు నటించిన చిత్రం కేజీఎఫ్ చాప్టర్ -2. ఈ చిత్రం టీజర్ ఈ నెల 8వ తేదీన విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్‌గా నిలిచింది.
గతంలో వచ్చిన 'కేజీఎఫ్' చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న "కేజీఎఫ్-చాప్టర్ 2" విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలైన 10 గంటల వ్యవధిలోనే రాజమౌళి "ఆర్ఆర్ఆర్", విజయ్ హీరోగా రానున్న "మాస్టర్" చిత్రాలను దాటేసింది.
యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన తర్వాత 10 గంటలా 30 నిమిషాల వ్యవధిలో "కేజీఎఫ్ - చాప్టర్ 2" 20 లక్షల వ్యూస్‌ను తెచ్చుకుంది.
ఇదేసమయంలో తొలి 10.30 గంటల వ్యవధిలో 'మాస్టర్' 18.5 లక్షలు, 'సర్కార్' 11.8 లక్షలు, 'ఆర్ఆర్ఆర్' (రామరాజు ఫర్ బీమ్) 9.41 లక్షలు, 'మెర్సెల్' 7.82 లక్షల వ్యూస్‌ను తెచ్చుకున్నాయి. ఇక 7వ తేదీన టీజర్ విడుదల కాగా, ఇంతవరకూ 11 కోట్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.