Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ అభిమానులపై కంప్లైంట్ ఇచ్చిన హీరోయిన్? ఆమె ఎవరు?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:20 IST)
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై కావాలనే ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారని, గత రెండేళ్లుగా ఇలా జరుగుతోందని, దీని వలన తాను ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నానని తెలిపారు.


ఎన్నికల ప్రచార సమయంలో పూనమ్ కౌర్ ప్రస్తావన తెస్తూ పవన్ కళ్యాణ్ మీద నిందలు వేస్తూ, కొన్ని ఆడియో టేపులు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. అప్పుడంతా సైలెంట్‌గా ఉండి, ఎన్నికలు ముగిసిన తర్వాత ఫిర్యాదు చేయడమేంటని సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
 
‘‘నేను చాలా పనులతో బిజీగా ఉన్నాను, అలాగే నా ఆరోగ్యం కూడా బాగాలేకపోవడంతో ఆలస్యంగా ఫిర్యాదు చేస్తున్నాను. ఎవరు చేసారు ఖచ్చితంగా తెలియదు గానీ నా వ్యక్తిగత జీవితం గురించి చాలా చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని తెలిపారు.

‘నాకు ఎవరిపై అనుమానం ఉందో పోలీసులకు చెప్పాను... మీకు ఆ విషయాలు వెల్లడించలేను' అని పూనమ్ కౌర్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై మీరు కంప్లయింట్ ఇచ్చినట్లు అంతా అనుకుంటున్నారు.. నిజమా? అనే ప్రశ్నకు పూనమ్ ‘‘అలాంటిదేమీ లేదండీ' అని స్పష్టం చేశారు.
 
ఇందులో పవన్ కళ్యాణ్‌కు సంబంధం ఉందని అనుమానపడుతున్నారా? అని అడగగా ‘‘అలా ఏమీ అనుకోవట్లేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఎవరో ఇదంతా చేశారనిపిస్తోంది. ఈ విషయంలో పోలీసులను పూర్తిగా నమ్ముతున్నాను.'' అని స్పష్టం చేశారు.

ఫైనల్‌గా మీ డిమాండ్ ఏమిటి? అని అడగగా, నాకు డిమాండ్ ఏమీ లేదు, జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. తప్పు చేస్తే కఠినమైన శిక్షపడాలి. ఇలాంటి పనులు చేస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి. ప్రస్తుతం మన సైబర్ చట్టాలు అంత శక్తివంతంగా లేవు. నా జీవితం గురించి మాట్లాడే హక్కు నాకు తప్ప వేరే ఎవరికీ లేదు.'' అని పూనమ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments