Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసగాళ్ళు బాగుపడలేరన్న పూనమ్ కౌర్.. ఎవరిని ఉద్దేశించి?

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (09:23 IST)
సినీ నటి పూమన్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరిని మోసం చేసిన వారు ఎన్నిటికీ బాగుపడలేరంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేశారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 
 
ఇంతకు పూనమ్ కౌర్ ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఓ సారిపరీలిద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంతా నాగచైతన్య విడాకుల అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉంది. గత కొన్ని రోజులుగా సస్పెన్స్‌కు తెర దించేలా నాగ చైతన్య, సమంతలు ఇద్దరు కూడా ఒకే నోట్‌ను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. 
 
'చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవరి దారిలో వారు నడవాలనే నిర్ణయానికి వచ్చేశాం. మా ప్రైవసీకి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించకూడదు' అంటూ అందులో పేర్కొన్నారు. అయితే వారి నిర్ణ‌యం త‌ర్వాత అభిమానులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు షాక్ అయ్యారు. ఎంతో చూడ‌చ‌క్కగా ఉండే ఈ జంట ఇలా విడిపోవ‌డం బాధ‌ను క‌లిగిస్తుంద‌ని ప‌లువురు పేర్కొన్నారు. 
 
అయితే సామ్ విడాకులు ప్ర‌క‌టించిన కొద్ది సేప‌టికి సిద్దార్థ్ చేసిన ట్వీట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 'మోస‌గాళ్లు ఎప్ప‌టికీ బాగు ప‌డ‌లేదు. ఇది చిన్న‌ప్పుడు స్కూల్‌లో టీచ‌ర్స్ నేర్పిన పాఠం.. మీరు ఏమంటారు' అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు పూనమ్ కౌర్ స్పందించింది. 
 
'అవును అది నిజమే' అని రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్ చేసింది ఎవ‌రి గురించి అంటూ సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ డిస్క‌షన్స్ న‌డుస్తున్నాయి. కాగా, చైత‌న్య‌ని పెళ్లి చేసుకునే ముందు స‌మంత - సిద్దార్థ్‌తో పీక‌ల్లోతు ప్రేమాయ‌ణం న‌డిపిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ళు కూడా పూర్తికాకముందే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments