Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా సిఫార్సు చేసినందువల్లనే అక్షయ్‌తో పూజా హెగ్డే సినిమా?

Webdunia
బుధవారం, 22 మే 2019 (19:00 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈమె కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే అల్లు అర్జున్‌తో చేసిన డీజే సినిమా తరువాత పూజా హెగ్డే దశ తిరిగి పోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో చేసిన అరవింద సమేత పెద్ద హిట్ కావడంతో ఈ అమ్మడి కెరీర్ గాడిలో పడింది. దాని తర్వాత మహేష్‌బాబుతో చేసిన మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పూజ కెరీర్ జోష్ మీద ఉంది. 
 
ప్రస్తుతం పూజా హెగ్డే చేతినిండా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. పూజా ప్రస్తుతం భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న జాన్ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రభాస్‌తో చేస్తున్న ఈ సినిమా కనుక హిట్ అయితే ఇక పూజ కెరీర్‌కు ఎటువంటి ఢోకా ఉండదు. 
 
వరుస హిట్‌లతో టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు, మరోవైపు బాలీవుడ్‌లో కూడా హౌస్ ఫుల్ 4 సినిమాలో అక్షయ్ కుమార్ సరసన నటిస్తోంది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్, కృతి కర్బందలు కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు పూజా హెగ్డే కూడా నటిస్తోంది.  
 
అయితే అక్షయ్ కుమార్ సినిమాలో అవకాశం రావడానికి పూజాకు రానాతో ఉన్న స్నేహమే కారణంగా తెలుస్తోంది. రానా సిఫార్సు చేసినందువల్లనే పూజాకు ఆ సినిమాలో అవకాశం వచ్చిందని వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్టయితే బాలీవుడ్‌లో పూజాకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని సినీ పండితుల విశ్లేషణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments