Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమలో పస లేదు.. అందుకే బ్రేకప్ చేపుతున్నా : నటి పూజాగౌర్

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (09:38 IST)
సినీ నటి పూజాగౌర్ తన ప్రేమకు బ్రేకప్ చెప్పేసింది. దశాబ్దకాలం పాటు సాగిన ప్రేమలో ఎలాంటి మజా లేదని చెబుతూ తన ప్రియుడుకి టాటా చెప్పేసింది. తాము విడిపోయినప్పటికీ స్నేహితుల్లో ఉంటామని చెప్పుకొచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నటి పూజాగౌర్ బుల్లితెర నటుడు రాజా సింగ్‌ అరోరాతో పదేళ్ళుగా  ప్రేమను కొనసాగిస్తోంది. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది కూడా. చిన్నచిన్న గొడవలు చోటుచేసుకుంటున్నట్టు చెప్పింది. దీంతో వారిద్దరూ విడిపోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
 
పైగా, తామిద్దరం పరస్పర అంగీకారంతో ఇద్దరం విడిపోయినట్టు తెలిపారు. రాజ్‌తో తనకున్న రిలేషన్ గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారని పేర్కొన్న నటి.. తామిద్దరం విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 
 
ఇక నుంచి ఎవరి జీవితం వారిదే అయినప్పటికీ తమ మధ్య ఇంతకాలం ఉన్న ప్రేమాభిమానాలు, ఒకరంటే మరొకరికి గౌరవం జీవితాంతం ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇకపై తామిద్దరం మంచి స్నేహితులమని, ఈ విషయంలో ఎప్పటికీ మార్పు ఉండబోదని పూజాగౌర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను దెబ్బ కొడితే ఇక లేవడం ఉండదు: రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ పంచ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments