'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ విడుదల ఎపుడంటే...

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (19:40 IST)
మణిరత్నం తెరకెక్కించిన "పొన్నియిన్ సెల్వన్-2" చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఏప్రిల్ 28వ తేదీన సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం బుధవారం అధికారికంగా వెల్లడించింది. 
 
భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం తొలి భాగం ఈ యేడాది సెప్టెంబరు 30వ తేదీన విడుదలైన ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రెండో భాగాన్ని కొత్త సంవత్సరంలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్‌లు విడుదల చేశాయి. 
 
2023 ఏప్రిల్ 28వ తేదీన "పొన్నియిన్ సెల్వల్-2" చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో కొనసాగనున్న సీక్వెల్ పార్టు అప్‌డేట్‌ను విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్ పాత్రల విజువల్స్‌తో రిలీజ్ చేశారు. 
 
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో జయం రవి, విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్, నాజర్, శరత్ కుమార్, జయరామ్, విక్రమ్ ప్రభు, పార్తిబన్, ప్రకాశ్ రాజ్, శోభిత ధూళిపాళ్ళ, ఐశ్వర్య లక్ష్మిలు కీలక పాత్రలను పోషించారు. అయితే, రెండో భాగంలో వీరంతా ఉంటారా? లేదా? అనే విషయంపై క్లారిటీ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments